Onion Crop : ఉల్లి పంటను ఆశించే పసుపు మరుగుజ్జు తెగుళ్లను నివారించే పద్ధతులు..!

ఉల్లి పంటను( Onion Crop ) ఆశించి తీవ్ర నష్టం కలిగించే పసుపు మరుగుజ్జు తెగుళ్లు ఒక వైరస్ వల్ల పంటను ఆశిస్తాయి.ఈ వైరస్ మట్టిలో ఉండే మొక్కల వ్యర్థాలలో చాలాకాలం జీవించి ఉంటాయి.

 Preventive Measures For Yellow Dwarf Pests In Onion Cultivation-TeluguStop.com

ఈ వైరస్ గడ్డలు, నారులు లేదా స్వచ్ఛంద మొక్కల ద్వారా ఉల్లి పంటను ఆశించి వ్యాప్తి చెందుతుంది.ఈ తెగులు( Pests ) ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు పెనుబంక ద్వారా వ్యాపిస్తుంది.

పెనుబంక పురుగులు మొక్క రసం పిలిచినప్పుడు వాటి నోటి ద్వారా ఈ వైరస్ ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది.ఈ వైరస్ వల్ల ఊహించని నష్టం ఎదుర్కోవలసి ఉంటుంది.

ఉల్లి పంట ఏ దశలో ఉన్నప్పుడైనా ఈ తెగులు ఆశించే అవకాశం ఉంది.తెగులు లక్షణాలు ఉల్లి ముదురు ఆకులపై గమనించవచ్చు.పసుపు పచ్చని గీతాలు విభిన్న ఆకృతల మచ్చలుగా ఏర్పడతాయి.ఈ వైరస్( Virus ) సోకడం వల్ల మొక్కల ఆకులు ముడుచుకుపోయి, వంకరులు తిరిగి ఎండిపోతాయి.

ఈ తెగుల తీవ్రత అధికం అయితే మొక్కలు పూర్తిగా పసుపు రంగులోకి( Yellow Color ) మారి ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది.

Telugu Farmers, Size, Yellow Dwarf, Preventive-Latest News - Telugu

ఉల్లిగడ్డలు పరిపక్వం తగ్గి పక్వానికి రాకముందే తరుగుతాయి.దీంతో ఉల్లిగడ్డల పరిమాణం( Onion Size ) కూడా తగ్గిపోతుంది.సహజంగా ఫలదీకరణ శాతం తగ్గి, విత్తనాల నాణ్యత కూడా తగ్గుతుంది.

పసుపు మరుగుజ్జు తెగుళ్లను వ్యాపించే వైరస్ ఆశించకుండా ఉండాలంటే పొలంలో పెనుబంకను నియంత్రించాలి.కలపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి.

పెనుబంక లేదంటే ఈ తెగుళ్లు ఆశించిన మొక్కలు కనిపిస్తే వాటిని పీకేసి, కాల్చి నాశనం చేయాలి.

Telugu Farmers, Size, Yellow Dwarf, Preventive-Latest News - Telugu

ఈ తెగుళ్లను పూర్తిస్థాయిలో అరికట్టే సేంద్రియ పద్ధతులు అందుబాటులో లేవు.కానీ ఈ తెగుళ్ల వ్యాప్తికి కారణం అయ్యే పెనుబంకను అరికట్టేందుకు రెండు శాతం వేప నూనె లేదంటే ఐదు శాతం వేప విత్తనపు సారంతో పిచికారి చేయాలి.రసాయన పద్ధతిలో పెనుబంకను నియంత్రించాలంటే.

ఎమామేక్టిన్ బెంజోఎట్ లేదా ఇండోక్సికార్బ్ లలో ఏదో ఒక రసాయన పిచికారి మందు వాడిన తర్వాత ట్రైజోఫోస్ ను వీటిలో ఏదో ఒక దానిలో కలిపి పిచికారి చేస్తే పెనుబంకను అరికట్టవచ్చు.దీంతో తెగుళ్ల వ్యాప్తి ఉండదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube