సోనీ కంపెనీ జీ ఎంటర్టైన్మెంట్ ( Sony Company, Zee Entertainment )మధ్య విలీనం రద్దైంది.ఈ మేరకు సోనీ సంస్థ కీలక ప్రకటన చేసింది.10 బిలియన్ డాలర్ల విలువైన ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఇప్పటికే జీ సంస్థకు నోటీసును పంపిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే విలీనంపై జీ సంస్థకు ఇచ్చిన గడువు నిన్నటితో ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే అంతర్జాతీయ సంస్థ అయిన సోనీ గ్రూప్ కార్పొరేషన్ కు చెందిన అనుబంధ సంస్థయే ఎస్పీఎన్ఐ.ఈ నేపథ్యంలోనే మాతృసంస్థ ఆదేశాల మేరకు జీ ఎంటర్టైన్మెంట్ తో విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడించింది.