సాధారణంగా ఆడవారు చాలా ధైర్యవంతులు.మగవారు భయపడే చాలా విషయాలకు కూడా మగువలు భయపడరు.
కానీ కొన్ని విషయాలకు వచ్చేసరికి చిన్న పిల్లలు కూడా భయపడని విషయాలకు భయపడతారు.ఉదాహరణకు బొద్దింకలు, లేదంటే బల్లులు( Cockroaches, lizards ) చూస్తే వీరు వణికిపోతారు.
ఏదో పెద్ద ప్రళయం వచ్చినట్లు అరిచేస్తుంటారు.అలాగే వీరు ఇంకా ఎన్నో విషయాలకు భయపడిపోతుంటారు.
వాటిలో బాతులు కూడా ఒకటి.అని తాజాగా వైరల్ అవుతున్న వీడియో చెప్పకనే చెబుతోంది ఈ వీడియోలో ఒక యువతి రోడ్డుపై వస్తున్న బాతును చూసి చాలా భయపడి పోయింది అది ఎక్కడ పొడుస్తుందేమో అని హడలిపోయి ఒక రూమ్‌లోకి పరిగెత్తింది.
నేరుగా రోడ్డుపైన వెళ్లాల్సిన ఆమె అలా సడన్‌గా భయపడిపోయి రక్షణ కోసం పక్కకు వెళ్లడం చూస్తే ఆమెకి ఏదో పెద్ద ప్రమాదం పొంచి ఉందని ఎవరైనా అనుకుంటారు.కానీ తీరా చూస్తే అది ఒక బాతు.దీనికే ఆమె భయపడింది అని తెలిస్తే ఎవరికైనా నవ్వు రాక తప్పదు.ఈ ఫన్నీ వీడియోను ఇంటర్నెట్ హాల్ ఆఫ్ ఫేమ్( Internet Hall of Fame ) అనే ట్విట్టర్ పేజీ పంచుకుంది.
దీనికి షేర్ చేసిన సమయం నుంచి ఇప్పటివరకు రెండు కోట్ల నలభై లక్షల వ్యూస్ వచ్చాయి.
ఈ వీడియో చూసిన చాలామంది ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.కొందరు బాగా నవ్వుకుంటున్నారు.ర్యాష్‌గా పెద్ద కారు, లేదంటే కుక్క, లేదా వేరే ఏదైనా దాడి చేసే పెద్ద జంతువు వస్తుందేమో అని తాము భావించినట్లు కొందరు పేర్కొన్నారు.
ఈ హిలేరియస్ వీడియోను మీరు కూడా చూసేయండి.