భారత మహిళల జట్టు ఆల్ రౌండర్ దీప్తి శర్మ( Deepti Sharma ) టీ20 ల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది.విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్ దిగ్గజాలకు సాధ్యం కానీ అరుదైన రికార్డును దీప్తి శర్మ సాధించి తన పేరిట లిఖించుకుంది.టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేయడంతో పాటు 100 వికెట్లు తీసిన తొలి భారత క్రికెటర్ గా దీప్తి శర్మ సరికొత్త రికార్డు సృష్టించింది.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా( India vs Australia ) మహిళల జట్ల మధ్య జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఆదివారం డివై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన రెండవ టీ20 మ్యాచ్ లో దీప్తి శర్మ ఈ ఘనత సాధించింది.
ఈ మ్యాచ్లో భారత్ టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలం అయ్యి కష్టాల్లో పడ్డప్పుడు క్రీజులోకి వచ్చిన దీప్తి 30 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించింది.
అనంతరం బౌలింగ్ లో కూడా తన సత్తా చాటి దీప్తి శర్మ రెండు వికెట్లను తీసింది.అయితే ఆస్ట్రేలియా జట్టు బ్యాటర్లైన ఎలీసా పెర్రీ,( Ellyse Perry ) ఫోభే లిచ్ ఫీల్డ్( Phoebe Litchfield ) అద్భుతంగా ఆడి ఆస్ట్రేలియా జట్టును గెలిపించారు.దీంతో ఈ టీ20 సిరీస్ సమం అయింది.
ఇక మూడవ టీ20 మ్యాచ్ లో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్లో భారత జట్టు తప్పక గెలవాల్సిందే.ఎందుకంటే.భారత జట్టు( Team India ) సొంత గడ్డపై ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ గెలవలేదు.అందని ద్రాక్ష పండు లాగా ఉండే ఈ టీ20 సిరీస్( T20 Series ) గెలవాలని భారత్ గట్టి పట్టుదలతో ఉంది.
టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ 4008 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.రోహిత్ శర్మ 3853 పరుగులతో రెండవ స్థానంలో ఉన్నాడు.బౌలర్ల విషయానికి వస్తే.యుజ్వేంద్ర చాహాల్ 96 వికెట్లు తీసి రెండవ ఉండగా.భువనేశ్వర్ కుమార్ 90 వికెట్లతో మూడవ స్థానంలో ఉన్నాడు.