స్టార్ హీరో అల్లు అర్జున్ ( Allu Arjun ) ప్రస్తుతం 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ తెలుగు చిత్రసీమ పరిశ్రమలో ఎంతో గొప్ప పొజిషన్ లో ఉన్నారు.మరీ ముఖ్యంగా ఈయన నటనకి గానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా వచ్చింది.
అయితే ఇప్పటివరకు ఈ అవార్డుని తెలుగు సినీ చరిత్రలో ఏ హీరో కూడా అందుకోలేదు.అలాంటిది అల్లు అర్జున్ ఈ అవార్డు అందుకోవడంతో చాలామంది ఈయనపై ప్రశంసలు కురిపించారు.
ఈ విషయం పక్కన పెడితే కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తున్న అల్లు అర్జున్ కి ఓ నిర్మాత మాత్రం సినిమా పూర్తి చేశాక డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారట.మరి ఆ నిర్మాత ఎవరు? ఎందుకు అల్లు అర్జున్ కి రెమ్యూనరేషన్ ఇవ్వకుండా మాట దాటేసారు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లు అర్జున్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి ( Gangothri ) అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు.ఇక ఈ సినిమా కంటే ముందే చిరంజీవి హీరోగా చేసిన విజేత సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు.అలాగే డాడీ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపిస్తారు.అయితే తాజాగా విజేత సినిమా గురించి ఒక విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు అల్లు అర్జున్.
అల్లు అర్జున్ చిరంజీవితో విజేత సినిమాలో చేసే టైం లో చిన్నబ్బాయి.అయితే ఈ విజేత ( Vijetha ) సినిమాకు సంబంధించి 100 డేస్ ఫంక్షన్ లో అల్లు అరవింద్ ఒక షీల్డ్ అందుకున్నారు.
అయితే ఆ షీల్డ్ కి సంబంధించిన ఒక ఫోటోని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ నేను నటించిన మొట్టమొదటి సినిమా విజేత.ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా మా నాన్నే చేశారు.అయితే ఇన్ని సంవత్సరాలుగా నేను గ్రహించింది ఏమిటంటే ఈ సినిమాలో నేను నటించినందుకు మా నాన్న నాకు రెమ్యూనరేషన్ ఇవ్వలేదు అంటూ అల్లు అర్జున్ సరదాగా ఒక పోస్ట్ పెట్టారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.