ఎవ్వరినీ వదలడం లేదు ! మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసులు 

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఎవరిని ఆశామాషి గా వదిలిపెట్టేలా కనిపించడం లేదు.ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి,  అక్రమాలతో పాటు, అప్పటి మంత్రులు , బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి వ్యవహారాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.

 Telangana Cm Revanth Reddy Strict Action Against Former Brs Mlas And Ministers D-TeluguStop.com

గతంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్న వారు, తనపై వ్యక్తిగత,  రాజకీయ విమర్శలతో ఇబ్బంది పెట్టిన వారిని ఇప్పుడు ఓ ఆట ఆడుకుంటున్నారు.గత ప్రభుత్వంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల( BRS Leaders ) వ్యవహారాలపై కూపీ లాగుతున్నారు.

వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు.ఈ లిస్టులో ఎమ్మెల్యేలు , మాజీ మంత్రులు ఉండడం కలకలం రేపుతోంది.

కొద్దిరోజులు క్రితం బీఆర్ఎస్ కీలక నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి( Jeevan Reddy ) లీజు వ్యవహారాలపై , మాజీ మంత్రి మల్లారెడ్డి( Mallareddy ) అక్రమ రిజిస్ట్రేషన్, భూ కబ్జా వ్యవహారాల పైన కేసులు నమోదయ్యాయి ఇంకా అనేకమంది మాజీ మంత్రులు,  మాజీ ఎమ్మెల్యేలు పేర్లు తెరపైకి వస్తుండడంతో , బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది.చాలా మంది ప్రజాప్రతినిధుల సెటిల్మెంట్లు,  అవినీతి వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు వరకు వెళ్లిన వాటిపై కేసులు నమోదు అయ్యాయి.ఇప్పుడు అటువంటి వాటన్నిటిని రేవంత్ బయటికి తీస్తున్నారు.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి లీజుకు తీసుకున్న భూములు వ్యవహారంతో మొదలైన వేట ప్రస్తుతం మాజీ మంత్రి మల్లారెడ్డి వరకు కొనసాగుతూనే ఉంది. 

Telugu Armuru Mla, Brs, Jeevan Reddy, Malla, Niranjan Reddy, Pallarajeshwar, Pcc

రాబోయే రోజుల్లో మరి కొంతమంది అవినీతి వ్యవహారాలు వెలుగులోకి వచ్చేలా కనిపిస్తుండటంతో అప్పట్లో ఆరోపణలు ఎదుర్కున్న మంత్రులు బీఆర్ఎస్ కీలక నేతలు కంగారు పడుతున్నారు.ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గతంలో ఆర్టీసీ నుంచి తీసుకున్న భూములకు వార్షిక ఫీజు చెల్లించకపోవడం,  విద్యుత్ బకాయిలు పేరుకుపోవడం వంటి వాటిపై నోటీసులు జారీ అయ్యాయి.  స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్( State Finance Corporation ) నుంచి తీసుకున్న రుణాలు విషయంలోనూ అనేక వివాదాలు ఉన్నాయి.

Telugu Armuru Mla, Brs, Jeevan Reddy, Malla, Niranjan Reddy, Pallarajeshwar, Pcc

ఇక మాజీ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ , మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవరం ఎస్టీ కాలనీలో గిరిజనులకు చెందిన 47 ఎకరాల భూమిని అక్రమంగా అన్యాక్రాంతం చేసుకున్నారని శామీర్ పేట పోలీస్ స్టేషన్ లో నవంబర్ 18న ఫిర్యాదు అందింది.డిసెంబర్ 6 పోలీసులు చీటింగ్ కేసుతో పాటు , ఎస్సీ , ఎస్టీ కేసులు నమోదు చేశారు.ఇదేవిధంగా గతంలో అనురాగ్ యూనివర్సిటీ కోసం ప్రస్తుత జనగామ ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్రెడ్డి( Palla Rajeshwar Reddy ) భూములు బలవంతంగా లాక్కున్నారని ఆరోపణలు ఉన్నాయి.ఇదేవిధంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి( Niranjan Reddy ) మీద ఆలయాల భూములను కబ్జా  చేసి తమ అనుచరుల  పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణలు ఉన్నాయి.

Telugu Armuru Mla, Brs, Jeevan Reddy, Malla, Niranjan Reddy, Pallarajeshwar, Pcc

అలాగే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్( Srinivas Goud ) పేరు వాడుకుని ఆయన అనుచరులు , బంధువులు, మహబూబ్ నగర్ లో భూముల కబ్జాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.ఇంకా అనేకమంది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై అవినీతి ఆరోపణలు,  భూకబ్జాలు సెటిల్మెంట్లు వ్యవహారం వెలుగు చూడడంతో ఇప్పుడు వాటిని బయటకు తీసి బీఆర్ఎస్ ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు, సదరు కేసులు ఉన్నవారిని జైలుకు పంపడమే లక్ష్యంగా రేవంత్ దూకుడు ప్రదర్శిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube