టీ20 మ్యాచ్ లో భారత్ పై దక్షిణాఫ్రికా గెలవడానికి ప్రధాన కారణాలు ఇవే..!

సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా( South Africa _ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత్ చివరి వరకు పోరాడి ఓటమిని చవిచూసింది.మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను కుదించారు.

 These Are The Main Reasons Why South Africa Won Against India In The T20 Match,-TeluguStop.com

సౌత్ ఆఫ్రికా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 19.3 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.భారత జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 56, రింకూ సింగ్ ( Rinku Singh )68 పరుగులతో అద్భుతంగా రాణించారు.

తిలక్ వర్మ 29 పరుగులతో కాస్త పర్వాలేదు అనిపించాడు.మిగిలిన బ్యాటర్లు చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయారు.యశస్వి జైస్వాల్, శుబ్ మన్ గిల్ పరుగులు చేయకుండానే డకౌట్ గా వెనుదిరిగారు.సౌత్ ఆఫ్రికా బౌలర్ కొయెట్జీ మూడు వికెట్లను తీసి భారత బ్యాటర్ లను కట్టడి చేశాడు.

Telugu India, Kuldeep Yadav, Rinku Singh, Africa-Sports News క్రీడల

మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడం వల్ల సౌత్ ఆఫ్రికా టార్గెట్ ను 15 ఓవర్లకు 152 గా నిర్ణయించారు.సౌత్ ఆఫ్రికా జట్టు 13.5 ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోయి విజయం సాధించింది.సౌత్ ఆఫ్రికా బ్యాటర్లైన హెండ్రిక్స్ 49, మార్ క్రమ్ 30 పరుగులతో రాణించారు.

భారత జట్టు బౌలర్లైన ముఖేష్ కుమార్ రెండు వికెట్లు, కుల్దీప్ యాదవ్ ( Kuldeep Yadav )ఒక వికెట్, మహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశారు.

Telugu India, Kuldeep Yadav, Rinku Singh, Africa-Sports News క్రీడల

మ్యాచ్ గెలిచిన తర్వాత సౌత్ ఆఫ్రికా జట్టు కెప్టెన్ మార్ క్రమ్ మాట్లాడుతూ వర్షం రావడం తమ జట్టుకు బాగా కలిసి వచ్చిందని చెప్పాడు.మొదట్లో వికెట్ స్లోగా ఉంది కానీ వర్షం రాకతో పరిస్థితి మారిపోవడం, వర్షం మాకు బాగా కలిసి వచ్చిందని, తమ జట్టు బౌలర్లు ఎంతో శ్రమించి రాణించారని తెలిపాడు.ప్రస్తుతం తమ జట్టులో ఈ ఆరోగ్యవంతమైన పోటీ ఉండడమే గెలుపుకు కారణం అని చెప్పుకొచ్చాడు.

హెండ్రిక్స్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడని చెప్పాడు.ఈ టీ20 సిరీస్ లో మొదటి మ్యాచ్ రద్దు అయిన సంగతి తెలిసిందే.

రెండవ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది.ఇక గురువారం జరిగే మూడవ మ్యాచ్లో భారత్ గెలిస్తే సిరీస్ 1-1 గా ముగుస్తుంది.

ఒకవేళ సౌత్ ఆఫ్రికా గెలిస్తే సిరీస్ సౌత్ ఆఫ్రికాదే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube