కన్నడ చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neil ) ఒకరు.కన్నడ డైరెక్టర్ గా కొనసాగుతున్నటువంటి ఈయన కే జి ఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్గా మారిపోయారు.
ఇలా ఈ సినిమాతో ఎంతో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన సినిమాలలో నటించడానికి ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలు ఎదురుచూస్తున్నారు.ఇక ప్రస్తుతం ప్రశాంత్ ప్రభాస్ ( Prabhas ) హీరోగా నటిస్తున్న సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఇదివరకే ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.

ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి ట్రైలర్ భారీ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంటుంది.ఇక ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.కే జి ఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ దర్శకత్వంలో వస్తున్నటువంటి సలార్( Salaar ) సినిమాపై అభిమానులలో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఈ సినిమా ప్రమోషన్లలో కూడా చిత్ర బృందం ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నటువంటి ప్రశాంత్ తన డ్రీమ్ గురించి తెలియజేశారు.

ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఈయన దర్శకత్వంలో వచ్చే సినిమాలలో భాగం కావాలని ఎదురు చూస్తూ ఉండగా ప్రశాంత్ మాత్రం ఒక హీరో కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది.ఆయనతో సినిమా చేయడమే తన కల అంటూ చెప్పుకొస్తున్నారు.తాను చనిపోయేలోపు ఒక్క సినిమాలో అయిన ఆ హీరోతో చేయాలన్నది తన డ్రీమ్ అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.మరి ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే ఆయన మరెవరో కాదు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్( Amitab Bachchan ).అమితాబ్ గారి సినిమాలను చూసి తాను ఎన్నో నేర్చుకున్నానని అందుకే తన సినిమాలలో ఆయనతో కలిసి చేయాలనేది తన కల అని తెలిపారు.ఇక అమితాబ్ గారితో విలన్ పాత్రలలో మాత్రమే చేయాలని ఈయన తెలిపారు.
అమితాబ్ గారు నా సినిమాలలో నటించడాన్ని నేను పెద్ద గౌరవంగా భావిస్తానంటూ ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.