Soundarya Babu Mohan: ఒక్క పాట కోసమే 365 రోజులు థియేటర్స్ హౌస్ ఫుల్.. ఏ పాటనో తెలుసా?

ప్రస్తుత కాలంలో ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అంటే ఒక పది రోజులపాటు థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేయడం గగనంగా మారిపోయింది.ఎంత పెద్ద స్టార్ హీరోలైన సినిమా పది రోజులకు మించి ఆడటం కష్టతరం అనే చెప్పాలి.

 Theaters Are Full For 365 Days Just For Chinuku Chinuku Andelatho Song-TeluguStop.com

కానీ ఒకప్పుడు ఒక సినిమా సంవత్సరాలు తరపున ఆడేవి అంటే అతిశయోక్తి కాదు ఐతే అప్పట్లో ప్రతి ఒక్క సినిమా కూడా ఇలాగే మూడు నాలుగు నెలల పాటు తియేటర్లలో హౌస్ ఫుల్ తో( House Full ) రన్ అయ్యేవి.పాట కోసమే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి హౌస్ ఫుల్ చేయడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.

సినిమామొత్తానికి కాకుండా కేవలం ఒక్క పాట చూడటం కోసమే థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యేవి.అలా సంవత్సరం పాటు ఆ పాట చూడటం కోసమే ప్రేక్షకులు వచ్చేవారు అంటే అతిశయోక్తి కాదు మరి ఆ పాట ఏంటి అనే విషయానికి వస్తే… కృష్ణ వంశీ (Krishnavamshi) దర్శకత్వంలో బాబు మోహన్(Babu Mohan) సౌందర్య (Soundarya)నటించిన చినుకు చినుకు అందెలతో అనే పాట ఇప్పటికే ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ఈ పాటలో బాబు మోహన్ తో కలిసి సౌందర్య నటించడం అప్పట్లో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి బాబు మోహన్ ఈ పాట గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా బాబు మోహన్ మాట్లాడుతూ సౌందర్య గారితో ఈ పాటలో నటించడం నిజంగానే తన అదృష్టమని తెలిపారు.ఈ పాట 365 రోజుల పాటు హౌస్ ఫుల్ థియేటర్తో రన్ అయిందని ఈయన తెలిపారు.ఒక థియేటర్ వద్దకు సెకండ్ షో కి వెళ్లగా థియేటర్ ముందు నాది సౌందర్యది పెద్ద కటౌట్స్ ఏర్పాటు చేశారు.అది చూసి నీ జన్మ ధన్యం అయిపోయింది బాబు మోహన్ ఇంతకంటే ఇంకేం కావాలి అని తనకు అనిపించింది అయితే 365 రోజులను ఉంది అక్కడ చూస్తే హౌస్ ఫుల్ అని ఉంది నాకు ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది సంవత్సరం పాటు హౌస్ ఫుల్ తో నడవడం ఏంటి అని మేనేజర్ దగ్గరికి వెళ్ళాను.

ఇదేంటి బయట 365 రోజులని ఉంది ఇక్కడ హౌస్ ఫుల్ అని ఉంది ఎలా సాధ్యమని అనడంతో ఇది నిజంగానే హౌస్ ఫుల్ అయింది సార్ అని చెప్పారు.వెళ్లి చూద్దాం పద అని అడగడంతో థియేటర్లో ( Theater ) అక్కడక్కడ ఒక 50 మంది దాకా ప్రేక్షకులు ఉన్నారు.దీనిని హౌస్ ఫుల్ అంటారా అని అడగడంతో రెండు నిమిషాలు ఉండండి సర్ మీకే అర్థమవుతుంది అన్నారు.అప్పటికి చినుకు చినుకు అందెలతో( Chinuku Chinuku Andelatho Song ) అనే పాట మొదలైంది.

ఆ పాటికి జనాలందరూ కూడా హౌస్ఫుల్ అయిపోయారు.ఆ పాట అయిపోగానే వెళ్లిపోయారు ఇలా పాట చూడటం కోసమే ప్రేక్షకులు థియేటర్లకు రావడం చూసి నేను ఆశ్చర్యపోయాను ఇంతకన్నా గొప్ప అదృష్టం నాకు ఏదీ లేదని బాబు మోహన్ తెలిపారు.

ఇక ఈ పాటలో సౌందర్య గారు నాతో కలిసి నటించడం పట్ల పలువురు ఎన్నో విషయాలను తెలిపారు.కొంతమంది సౌందర్యకు నాతో నటించవద్దు అంటూ కూడా సలహా ఇచ్చారు.కానీ సౌందర్య ఒకటే మాట అన్నారు బాబు మోహన్ గారితో నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం అంటూ సౌందర్య అన్నారని ఆ ఒక్క మాటకు ఆమెకు దండం పెట్టవచ్చు అంటూ ఈ సందర్భంగా బాబు మోహన్ తెలిపారు.అయితే సౌందర్య మరణం గురించి కూడా ఈయన బాధపడ్డారు ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి తనకు అలాంటి చావు రాకూడదని ఈయన ఈ సందర్భంగా సౌందర్యం మరణం పై కూడా విచారం వ్యక్తం చేశారు.

https://www.facebook.com/watch/?extid=WA-UNK-UNK-UNK-AN_GK0T-GK1C&mibextid=5SVze0&v=378935697709910
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube