భార్య, కూతురు నిద్రిస్తున్న గదిలోకి పామును వదిలి అంతమొందించిన కసాయి వ్యక్తి..!

ఒక్కసారి వ్యక్తి తన కుటుంబం పట్ల కాల యముడుగా మారి భార్య, రెండేళ్ల కూతురు నిద్రిస్తున్న గదిలోకి విష సర్పాన్ని( Poisonous Snake ) వదిలి అంతమొందించిన ఘటన పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

 Odisha Man Kills Wife And Daughter By Releasing Poisonous Snake Into Room Detail-TeluguStop.com

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.ఒడిస్సా లోని( Odisha ) గంజయ్ జిల్లా కబీసూర్య నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే అధేగావ్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల గణేష్ పత్రాకు, బసంతి(23) అనే యువతికి 2020లో వివాహం జరగగా.

వీరికి రెండేళ్ల కుమార్తె దేవస్మిత సంతానం.వివాహం తర్వాత కొంతకాలం వీరి కాపురం సాఫీగానే సాగింది.

అయితే గత కొంతకాలంగా ఈ దంపతుల మధ్య తరచూ గొడవలే.ఈ క్రమంలో గణేష్( Ganesh Patra ) తన భార్య, కుమార్తె అడ్డు తొలగించుకోవాలని వీరిని హతమార్చేందుకు ఓసారి కొత్త ప్లాన్ వేశాడు.

ప్లాన్ లో భాగంగా గత నెల అక్టోబర్ ఆరవ తేదీన పాములు ఊదే వ్యక్తి నుంచి ఒక విషపూరిత సర్పాన్ని ప్లాస్టిక్ డబ్బాలో ఇంటికి తీసుకు వచ్చాడు.

Telugu Basanthi, Devasmitha, Ganesh Patra, Kills, Odisha, Snake, Snake Bite-Late

భార్య, కుమార్తె నిద్రిస్తున్న గదిలోకి అర్ధరాత్రి ఆ విష సర్పాన్ని మంచం కింద వదిలిపెట్టి, అతడు మరుగదిలో వెళ్లి నిద్రపోయాడు.ఉదయం లేచి గది తలుపులు తెరిచేసరికి భార్య, కూతురు పాముకాటుతో మరణించి మంచం పై విగత జీవులుగా పడి ఉన్నారు.గణేష్( Ganesh ) తనకేం తెలియనట్టు పోలీసులకు సమాచారం అందించాడు.

పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం తరలించారు.

Telugu Basanthi, Devasmitha, Ganesh Patra, Kills, Odisha, Snake, Snake Bite-Late

గణేష్ తనపై ఎవరికీ అనుమానం రాలేదని, భార్య, కుమార్తె అడ్డు తొలగిందని చాలా సంబరపడ్డాడు.కానీ మృతురాలి తండ్రి తన కూతురిని అల్లుడే హత్య చేశాడని పోలీసులకు( Police ) ఫిర్యాదు చేశాడు.దీంతో గణేష్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులకు విచారణలో అతని మాట తీరుపై అనుమానం కలిగింది.

తమదైన శైలిలో విచారించగా అసలు విషయం పోలీసులకు చెప్పేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube