Alia Bhatt : నాకు పాత బట్టలు వేసుకోవడమే ఇష్టం.. ఏడాది మొత్తం షాపింగ్ చేయను

ఆర్ఆర్ఆర్ ఫేమ్( RRR ), బాలీవుడ్ బ్యూటీ అలియా భట్( Alia Bhatt ) గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.ఈ ముద్దుగుమ్మ ఈ మూవీలో రామ్ చరణ్ ఫియాన్సీ సీతగా మెరిసింది.

 Alia Bhatt About Her Outfits Repeat Bollywood-TeluguStop.com

డెబ్యూ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ ముద్దుగుమ్మ ఇప్పటిదాకా మహా అంటే పాతిక సినిమాల్లో నటించి ఉంటుందేమో కానీ ఎంతో అనుభవం సంపాదించిన దిగ్గజ నటులతో సమానమైన పేరు తెచ్చుకుంది.

నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది.దాంతోపాటు లెక్కలేనని అవార్డ్స్ తన సొంతం చేస్తుంది.

ఈ బ్యూటీ మంచి యాక్టర్ మాత్రమే కాదు మంచి అందగత్తె కూడా.అందుకే రెమ్యునరేషన్( Remuneration ) కూడా ఈ తారది చాలా ఎక్కువగానే ఉంటుంది.

Telugu Alia Bhatt, Bollywood, Jeans, Ram Charan, Ranbir Kapoor, Tollywood-Movie

తక్కువ సమయంలోనే ఈ అందాల తార వందల కోట్ల రూపాయలు సంపాదించింది.అయితే అంత సంపాదించినా ఆమె ఒకసారి కట్టుకున్న డ్రెస్సులను పారేయదు.వాటినే చాలాసార్లు కట్టుకుంటుంది.ఆ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.సాధారణంగా హీరో, హీరోయిన్లు ఒకసారి వేసుకున్న డ్రెస్సును మరొకసారి వేసుకోరనే ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది.మిగతా వారి విషయంలో అది నిజమో అబద్దమో తెలియదు కానీ అలియా భట్ మాత్రం ఏడాది పొడుగునా డ్రెస్సులు అస్సలు కొనుగోలు చేయదట.365 రోజులు ఔట్‌ఫిట్స్‌ కొనుగోలు చేసినా వాటిని వార్డ్‌రోబ్ లో కూడా ఉంచలేమని ఆమె కామెంట్స్ చేసింది.రిపీటెడ్ గా డ్రెస్సులు వేసుకోవడం చాలా నార్మల్ అని పేర్కొంది.

Telugu Alia Bhatt, Bollywood, Jeans, Ram Charan, Ranbir Kapoor, Tollywood-Movie

ఔట్‌ఫిట్ రిపీట్ చేయకూడదనే ఒక ఆలోచన ఉంటే దాన్ని మైండ్ నుంచి తీసేయాలని, అలాంటి ఆలోచన ఎవరికీ రాకూడదని ఆమె సలహా ఇచ్చింది.ఇలా ఆలోచించడం సరైనది కాదని కూడా ఆమె తెలిపింది.“మైండ్‌-లెస్‌గా పదేపదే డ్రెస్సులు కొనుగోలు చేసుకుంటూ పోతే పర్యావరణానికి కూడా హాని చేసినట్లు అవుతుంది.మీరు వాడిపడేసిన బట్టలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో మీకు ఒక అవగాహన ఉండాలి.

వాటి షెల్ఫ్ లైఫ్ పెంచుకోవడానికి ప్రయత్నించాలి.నేను ఔట్‌ఫిట్స్ రిపీట్ చేస్తాను.” అని అలియా భట్( Alia Bhatt ) ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది.ఔట్‌ఫిట్స్ మాత్రమే కాదు బూట్లు బ్యాగులు జీన్స్ ఇలాంటివన్నీ తాను చాలా రోజులు వేసుకుంటానని.

వాటిని రిపీటెడ్ గా వేసుకోవడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె తెలిపింది.ఎంతో స్టార్ డం ఉన్నప్పటికీ సింపుల్ గా ఉంటూ పర్యావరణం మేలు కోసం అలియా భట్ ఆలోచించడం నిజంగా ప్రశంసనీయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube