జైలు క్టస్టర్ నుంచి ఖైదీని బదిలీ చేయడానికి 1,33,000 సింగపూర్( Singapore ) డాలర్ల లంచం డిమాండ్ చేసిన భారత సంతతికి చెందిన సీనియర్ జైలు వార్డెన్‌ను సింగపూర్ కోర్ట్ సోమవారం దోషిగా నిర్ధారించింది.నిందితుడిని 56 ఏళ్ల కోబి కృష్ణ( Kobi Krishna ) ఆయావూగా గుర్తించారు.
ఖైదీల సమాచారాన్ని వీక్షించేందుకు జైలులో ఏర్పాటు చేసిన వ్యవస్ధను యాక్సెస్ చేయడానికి తన సహచరులను ప్రేరేపించిన మరో ఘటనలోనూ కృష్ణను న్యాయస్థానం దోషిగా తేల్చిందని ఛానెల్ న్యూస్ ఏషియా ( Channel News Asia )నివేదించింది.అతనికి వచ్చే ఏడాది జనవరిలో కోర్టు శిక్ష విధించనుంది.
కృష్ణపై పది అభియోగాలను నమోదు చేశారు ప్రాసిక్యూటర్లు.వీటిలో చోగ్ కెంగ్ చై అనే ఖైదీ నుంచి లంచం డిమాండ్ చేసిన కేసు తీవ్రమైనదిగా నిర్ధారించారు.
సెప్టెంబర్ 2015 నుంచి మార్చి 2016 మధ్య చోంగ్( Chong ) నుంచి కృష్ణ లంచాలు డిమాండ్ చేసినట్లుగా ప్రాసిక్యూషన్ వాదించింది.కారు లోన్ వాయిదాలు, ఇంటి పునర్నిర్మాణాలు, పుట్టినరోజు వేడుకలు, క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించాల్సిందిగా కోరేవాడని తెలిపింది.2005లో తన ప్రియురాలి 7 ఏళ్ల కుమారుడిని దుర్భాషలాడి అతను చనిపోయేలా ప్రేరేపించినందుకు గాను చోంగ్‌కు 20 ఏళ్ల ప్రివెంటివ్ నిర్బంధ శిక్ష విధించింది కోర్ట్.అనంతరం అతనిని చాంగి జైలు ఏ1 క్టస్టర్‌లో వుంచారు.
సింగపూర్‌లో సుదీర్ఘమైన శిక్షలు పడిన నేరస్థులకు కట్టుదిట్టమైన భద్రత వుండే జైలుగా దీనికి గుర్తింపు వుంది.
నగదు లేదా రుణం ఇస్తే తనను ఏ1 క్లస్టర్ నుంచి మరో చోటికి మారుస్తానని కోబీ తనకు హామీ ఇచ్చాడని చోంగ్ పేర్కొన్నాడు.తనను ఏ1 నుంచి బదిలీ చేయగల అధికారం, సామర్ధ్యం కృష్ణకు లేవని తనకు తెలుసునని, అయితే తనకు ఇంటెలిజెన్స్ శాఖలో ఓ స్నేహితుడు వున్నాడని అతని ద్వారా తనను మరో చోటికి మారుస్తానని చెప్పినట్లు చోంగ్ వెల్లడించారు.అయితే 2016 ప్రారంభంలో వైద్య పరీక్ష తర్వాత కూడా అతనిని బదిలీ చేయలేదు.
తనపై వచ్చిన ఈ ఆరోపణలను కృష్ణ ఖండించాడు.తాను చోంగ్‌తో యార్ట్ టైమ్‌లో మాత్రమే మాట్లాడేవాడినని, వినిపించేంత దూరం నుంచే ఖైదీలతో సంభాషించేవాడినని చెప్పాడు.
కానీ కోబీ డబ్బు అడిగిన సందర్భాలను గుర్తుంచుకునేందుకు గాను చోంగ్ తన జైలు సెల్‌లోని మ్యాగజైన్‌పై వివరాలను రాసుకునేవాడు.కొత్త మ్యాగజైన్‌ను తీసుకున్నప్పుడల్లా రికార్డు మాదిరిగా వుంచుకునేవాడు.జూన్ 2016లో మెడికల్ సెంటర్లో వుండటానికి ముందు తన సెల్‌లోని ఒక కాగితంపై ఈ రికార్డులన్నింటినీ రాసుకున్నాడు.ఆ డాక్యుమెంట్లో కృష్ణ తనకు ఇచ్చిన బ్యాంక్ నెంబర్, ఫోన్ నెంబర్ వున్నాయి.
ఈ ఆరోపణల నేపథ్యంలో కృష్ణను 2017 జూలైలో ఉన్నతాధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు.అలాగే నెల జీతంలో కేవలం సగం మాత్రమే చెల్లించాలని ఆదేశించారు.