యాంకర్:- తిరుమల శ్రీవారి( Tirumala ) ఆలయం నుంచి స్వామి వారికి చెందిన బంగారు కాసుల హారాన్ని తిరుపతికి తరలించారు.తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి( Tiruchanur Sree Padmavati AmmaVaru ) బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో గజవాహనం సేవ చాలా ముఖ్యమైనది.
సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాల్లో గజవాహనంలో స్వామివారికి చెందిన కాసుల హారాన్ని అమ్మవారికి అలంకరణగా వేస్తారు.అందువల్ల శ్రీవారి ఆలయం నుంచి సాంప్రదాయం ప్రకారం టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి( Bhumana Karunakar Reddy ) ఈఓ ధర్మారెడ్డి మిగిలిన అధికారులు కాసుల హారాన్ని తిరుపతికి తరలించారు
.