కర్ణాటక రాష్ట్రంలో మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తెలిసిందే.ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు రైతులకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది.
అయితే అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ ఎలాంటి న్యాయం చేయటం లేదని.కర్ణాటక రైతులు ఇటీవల గగ్గోలు పెట్టడం జరిగింది.
ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కర్ణాటక రైతులు ప్రచారం కూడా చేయడం జరిగింది.కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోవద్దు అంటూ కాంగ్రెస్ రైతులు గద్వాల్ లో ప్రచారం చేశారు.
కరెంటు లేక మా పంటలు ఎండిపోతున్నాయి, కాంగ్రెస్ చేతిలో మేము మోసపోయాం తెలంగాణ ప్రజలు మోసపోకండి అంటూ తెలుగు ప్లకార్డులతో విజ్ఞప్తి చేశారు.
ఇటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది.తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కర్ణాటక రైతులకు శుభవార్త తెలియజేశారు.విషయంలోకి వెళ్తే ఎంత ఖర్చైనా ఇతర రాష్ట్రాల నుండి విద్యుత్ కొని రాష్ట్రంలో రైతులకు రెండు విడతల్లో ఏడు గంటల విద్యుత్ సరఫరా చేసి తీరుతామని ప్రకటించారు.
ఇటీవల విద్యుత్ శాఖ మంత్రి మరియు అధికారులతో సిద్ధరామయ్య రివ్యూ సమావేశం నిర్వహించడం జరిగింది.అనంతరం ఎట్టి పరిస్థితులలో రెండు విడతల్లో రైతులకు.ఏడు గంటల విద్యుత్తు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.