స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ఉన్న సంగతి తెలిసిందే.చంద్రబాబు అరెస్టు అయ్యి దాదాపు 40 రోజులకు పైగా కావస్తోంది.
పరిస్థితి ఇలా ఉంటే చంద్రబాబు ములాఖత్ లు జైలు అధికారులు తగ్గించడం తెలిసిందే.దీంతో చంద్రబాబుపై వివిధ కేసులు విచారణలో ఉన్నందున ములాఖత్ లు పెంచాలని.
విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు( Chandrababu Naidu ) తరపు లాయర్లు పిటిషన్లు దాఖలు చేశారు.ఈ పిటీషన్ పై నేడు విచారణ చేపట్టడంతో న్యాయస్థానంలో ఇరువార్గాల వాదనలు వినిపించారు.
ఈ క్రమంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో( Rajahmundry Central Jail ) ఉన్న అధికారులకు చంద్రబాబు లీగల్ ములాఖత్ లు రోజుకి రెండుసార్లు అనుమతిస్తూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.గతంలో చంద్రబాబును కలిసేందుకు రోజుకు రెండుసార్లు లీగల్ ములాఖత్ కు అవకాశం కల్పించడం జరిగింది.అయితే ఆ తర్వాత భద్రతా కారణాలతో దానిని రోజుకి ఒకసారి జైలు అధికారులు కుదించారు.ఈ క్రమంలో చంద్రబాబు తరపు లాయర్లు విజయవాడ ఏసీబీ కోర్టుని ఆశ్రయించడం జరిగింది.
లీగల్ ములాఖత్( Legal Mulaqat ) లు రోజుకి మూడుకి పెంచాలని కోరారు.దీంతో ఇరువు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం చంద్రబాబు లీగల్ ములాఖత్ లు రోజుకి రెండుకు పెంచాలని రాజమండ్రి జైలు అధికారులను ఆదేశించడం జరిగింది.