పండగ సమయంలో వాహన పూజ ఎలా చేస్తారో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే దసరా పండుగ( Dasara Festival ) సమయంలో వాహనాలకు, ఆయుధాలకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది.కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలతో పాటు, పాత వాహనాలకు కూడా పూజలు చేస్తారు.

 Do You Know How Vahana Puja Is Done During The Festival , Dasara Festival , Te-TeluguStop.com

ముఖ్యంగా చెప్పాలంటే కొందరు దేవాలయానికి వెళ్తే, మరికొందరు ఇంటి వద్దనే తమకు తెలిసిన రీతిలో వాహన పూజలు ( Vahana Pooja )చేస్తూ ఉంటారు.అయితే అసలైన పద్ధతిలో పూజ ఎలా చేయాలో చాలామందికి తెలియదు.

భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో వాహన పూజ అత్యంత ముఖ్యమైనది అని పండితులు చెబుతున్నారు.ఇనుము కొందరికి కలిసి వస్తుంది.

మరికొందరికి అంతగా కలిసి రాదు అనే భావన చాలామందిలో ఉంటుంది.

Telugu Camphor, Dasara Festival, Hanuman, Indian, Mango, Temple, Vahana Pooja-Te

అందుకే కొత్త వాహనం కొనుగోలు చేస్తే తప్పకుండా తమ ఇష్ట దైవం దేవాలయానికి తీసుకెళ్లి పూజ చేస్తారు.భవిష్యత్తులో ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా, వాహన ప్రయాణం సుఖంగా, సౌఖ్యంగా సాగాలని ఉద్దేశంతో ఈ పూజలు జరిపిస్తారు.అయితే సరైన పూర్తి పద్ధతి అందరికీ తెలిసి ఉండకపోవచ్చు.

అలాంటి వారి కోసం విజయదశమి నేపథ్యంలో వాహన పూజ ఎలా నిర్వహించాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ముందుగా వాహనాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఆ తర్వాత కలశంలో మంచి నీళ్లు తీసుకొని మామిడి ఆకులతో( mango leaves ) వాహనంపై మూడుసార్లు నీళ్లు చల్లాలి.ఆ తర్వాత వాహనంపై స్వస్తిక్ గుర్తు ( Swastik symbol )వేయాలి.

Telugu Camphor, Dasara Festival, Hanuman, Indian, Mango, Temple, Vahana Pooja-Te

ఆ తర్వాత వాహనానికి పూలమాల వేయాలి.అలాగే వాహనానికి కలవా ను మూడు రౌండ్లు చుట్టాలి.ఇప్పుడు కర్పూరంతో హారతి వెలిగించి వాహనం ముందు మూడుసార్లు తిప్పాలి.తర్వాత కలశంలో నీటిని వాహనం ముందు కుడి, ఎడమ వైపుకు పోయాలి.ఇలా చేయడం వల్ల వాహనాన్ని స్వాగతించినట్లు అవుతుంది.అలాగే కర్పూరం బూడిదతో వాహనానికి తిలకం దిద్దాలి.

ఇది వాహనాన్ని దిష్టి నుంచి రక్షిస్తుంది.అలాగే వాహనంపై స్వీట్లు పెట్టి కాసేపటి తర్వాత వాటిని తీసి గోమాతకు తినిపించాలి.

వాహనం ముందు ఏడుసార్లు తిప్పి ఆ తర్వాత కొబ్బరికాయలను కొట్టడం మంచిది.తర్వాత వాహనానికి అంతా మంచే జరగాలనే ఉద్దేశంతో చువ్వకు గవ్వలు తొడిగి దాన్ని వాహనం ముందు భాగంలో కట్టాలి.

అలాగే ఆకాశంలో ఎగురుతున్న హనుమంతుడి చిత్రాన్ని( Hanuman ) వాహనం లోపల గాని, బయట గాని వేలాడదీయడం మంచిది.ఆఖరుగా చక్రాల క్రింద నిమ్మకాయలు( Lemons ) పెట్టి ముందుకు సాగాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube