ఐఐటీ స్టూడెంట్ల వీరంగం... సిగ్గుపడండి అంటూ కామెంట్స్!

సాధారణంగా ఐఐటీల్లో( IIT ) చదువుతున్న స్టూడెంట్స్ అంటే చాలామంది వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, బుద్దిమంతులు, సౌమ్యంగా ఉంటారు అనేకదా.అయితే ఇక్కడ స్టోరీ మీరు విన్నారంటే వారికన్నా గల్లీల్లోన చదువుకొనే విద్యార్ధులు చాలా బెటర్ అని ఫీల్ అవుతారు.

 Iit Kanpur Fest Turn Wild Kabaddi Players Throw Chairs Viral Video Details, Iit-TeluguStop.com

అవును, హై ఫై స్టూడెంట్స్ అంటే గొడవల జోలికి అస్సలూ వెళ్లరు అనే అనుమానాలు వుంటాయి.కానీ ఉత్తర్ ప్రదేశ్ లోని( Uttar Pradesh ) కొందరు చేసిన పనులు చూస్తే.

మీ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది.

విషయం ఏమిటంటే, రాష్ట్రంలోని ఐఐటీ కాన్పూర్లో( IIT Kanpur ) వార్షిక స్పోర్ట్స్ ఈవెంట్ కన్నుల పండుగగా జరుగుతోంది.ఈ క్రమంలో రెండు కబడ్డీ జట్ల ఆటగాళ్ల మధ్య ఏదో విషయంపై చిన్న వాగ్వాదం జరిగింది.అది కాస్తా చినికి చినికి గాలివాన అయింది.

ఒకరిద్దరూ పోయి రెండు గ్రూపుల తగాదాగా మారింది.ఇంకేముంది రెండు గ్రూపుల సభ్యులు ఒకరినొకరు మీద పడి మరీ పిడిగుద్దులు గుద్దుకొని మరీ కొట్టుకున్నారు.

అంతటితో ఆగకుండా ఆ ప్రాంగణంలో వున్న కుర్చీలకు పని చెప్పారు.అక్కడితో వారి కోపం చల్లారినట్టు లేదు.

కింద పడి మరీ తన్నుకున్నారు, దొర్లారు.దొరికిన వస్తువుతో దొరికినట్లు విచక్షణారహితంగా దాడి చేసుకున్నారు.

కాగా ఈ ఘర్షణలో ఇరు వర్గాల స్టూడెంట్స్ కి గాయాలయ్యాయి.ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.గొడవకు స్పష్టమైన కారణం తెలియరాలేదు కానీ సదరు దృశ్యాలను చూసి నెటిజనం నవ్వుకుంటున్నారు.మీరు ఐఐటీ స్టూడెంట్స్( IIT Students ) అని చెప్పుకోవడానికి కాస్త సిగ్గుపడండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఘటన జరుగుతున్న టైంలో మహిళా క్రీడాకారులు భయపడి బయటకి పారిపోతున్న దృశ్యాలు కూడా బయటకి వచ్చాయి.దాంతో వీడియోలపై నెటిజన్లు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.కావాలంటే మీరు కూడా ఇక్కడ వైరల్ అవుతున్న దృశ్యాలను చూసి మీమీ అభిప్రాయాలను తెలియజేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube