ఇందిరా ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజిస్తే ఏమవుతుందో తెలుసా..?

సనాతన ధర్మం( Sanatana Dharma )లో ప్రతి ఏడాది 24 ఏకాదశిలు ఉంటాయి.అయితే అశ్విని మాసంలోనీ కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది.

 Do You Know What Happens If You Worship Lord Vishnu On Indira Ekadashi , Sanatan-TeluguStop.com

ఈ ఏకాదశిని ఇందిరా ఏకాదశి అని కూడా అంటారు.అయితే పితృపక్షంలో వచ్చే ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి ని పూజించడం ద్వారా స్వామి సంతృప్తి చెందుతారని, ఆ రోజు పూర్వీకులకు శ్రాద్ధం పెట్టడం ద్వారా పితృదేవతలకు వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పురాణాలలో ఉంది.

ఇందిరా ఏకాదశి అక్టోబర్ 10వ తేదీన వస్తూ ఉంది.అలాగే ఏకాదశి పితృ పక్షంలో వస్తుంది.

కాబట్టి ఈ ఏకాదశి ప్రాముఖ్యత మరింత పెరిగింది.

అలాగే ఇందిరా ఏకాదశి వ్రతం రోజు పూర్వీకుల శ్రాద్ధం చేయడం ద్వారా పితృదేవతలకు వైకుంఠధామం లభిస్తుందని శాస్త్రాలలో ఉంది.ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించడం వల్ల పూర్వికులు తృప్తి పొందుతారు.ఇంకా చెప్పాలంటే ఇందిరా ఏకాదశి తిధి అక్టోబర్ 9 మధ్యాహ్నం 12 గంటలకు మొదలై అక్టోబర్ 10వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు ముగుస్తుందని పండితులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే అక్టోబర్ 8వ తేదీన ఉదయం 10 గంటల 9 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1:12 నిమిషములకు విష్ణుమూర్తిని ఆరాధించడానికి అనువైన సమయం అని కూడా నిపుణులు చెబుతున్నారు.

అలాగే అక్టోబర్ 8వ తేదీన సాయంత్రం 10 గంటల ఆరు నిమిషాల నుంచి 19వ తేదీన రాత్రి 11 గంటలకు ఈ ఉపవాసం ఉంటుంది.ఇంకా చెప్పాలంటే ఇందిరా ఏకాదశి వ్రతం యొక్క ప్రాముఖ్యతను పురాణాలలో వెల్లడించారు.ఈ రోజున విష్ణువును పూజించడం వల్ల ఏడు తరాల వరకు పూర్వీకులకు మోక్షం లభిస్తుందని పండితులు( Scholars ) చెబుతున్నారు.అలాగే వారికి వైకుంఠధామం లభిస్తుందని కూడా చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube