రాజన్న సిరిసిల్ల జిల్లా : ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం సర్పంచ్ వెంకట్ రెడ్డి,బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి ( Bandari Bal Reddy )లతో కలిసి పదిమంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆస్పత్రిలో చికిత్స పొందిన వ్యక్తులకు సీఎంఆర్ఎఫ్ డబ్బులు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మేనమామ లాగా ఆడపడుచు పెండ్లికి ఒక లక్ష 16 వేళ్ళను అందజేస్తున్నారని గుర్తు చేశారు.చెక్కులను అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు పందిర్ల నాగరాణి,ఎనగందుల అనసూయ నర్సింలు, ఏఎంసి డైరెక్టర్ మెండే శ్రీనివాస్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎడ్ల సందీప్, మండల మహిళా అధ్యక్షురాలు అప్సర్ ఉన్నిసా అజ్జు, సీనియర్ నాయకులు మీసం రాజం, బాధ రమేష్, మేగి నరసయ్య,గంట వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.