ఇందిరా ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజిస్తే ఏమవుతుందో తెలుసా..?

సనాతన ధర్మం( Sanatana Dharma )లో ప్రతి ఏడాది 24 ఏకాదశిలు ఉంటాయి.

అయితే అశ్విని మాసంలోనీ కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది.

ఈ ఏకాదశిని ఇందిరా ఏకాదశి అని కూడా అంటారు.అయితే పితృపక్షంలో వచ్చే ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి ని పూజించడం ద్వారా స్వామి సంతృప్తి చెందుతారని, ఆ రోజు పూర్వీకులకు శ్రాద్ధం పెట్టడం ద్వారా పితృదేవతలకు వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పురాణాలలో ఉంది.

ఇందిరా ఏకాదశి అక్టోబర్ 10వ తేదీన వస్తూ ఉంది.అలాగే ఏకాదశి పితృ పక్షంలో వస్తుంది.

కాబట్టి ఈ ఏకాదశి ప్రాముఖ్యత మరింత పెరిగింది. """/" / అలాగే ఇందిరా ఏకాదశి వ్రతం రోజు పూర్వీకుల శ్రాద్ధం చేయడం ద్వారా పితృదేవతలకు వైకుంఠధామం లభిస్తుందని శాస్త్రాలలో ఉంది.

ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించడం వల్ల పూర్వికులు తృప్తి పొందుతారు.

ఇంకా చెప్పాలంటే ఇందిరా ఏకాదశి తిధి అక్టోబర్ 9 మధ్యాహ్నం 12 గంటలకు మొదలై అక్టోబర్ 10వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు ముగుస్తుందని పండితులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే అక్టోబర్ 8వ తేదీన ఉదయం 10 గంటల 9 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1:12 నిమిషములకు విష్ణుమూర్తిని ఆరాధించడానికి అనువైన సమయం అని కూడా నిపుణులు చెబుతున్నారు.

"""/" / అలాగే అక్టోబర్ 8వ తేదీన సాయంత్రం 10 గంటల ఆరు నిమిషాల నుంచి 19వ తేదీన రాత్రి 11 గంటలకు ఈ ఉపవాసం ఉంటుంది.

ఇంకా చెప్పాలంటే ఇందిరా ఏకాదశి వ్రతం యొక్క ప్రాముఖ్యతను పురాణాలలో వెల్లడించారు.ఈ రోజున విష్ణువును పూజించడం వల్ల ఏడు తరాల వరకు పూర్వీకులకు మోక్షం లభిస్తుందని పండితులు( Scholars ) చెబుతున్నారు.

అలాగే వారికి వైకుంఠధామం లభిస్తుందని కూడా చెబుతున్నారు.

నెట్ ఫ్లిక్స్ లో చైతన్య శోభిత వెడ్డింగ్… స్ట్రీమింగ్ రైట్స్ ఎంతనో తెలుసా?