వన్డే వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్ గా సచిన్ టెండూల్కర్..!

భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్( ODI World Cup ) ప్రారంభం అవ్వడానికి మరికొన్ని గంటల సమయం ఉందని అందరికీ తెలిసిందే.అయితే ప్రపంచ కప్ 2023 బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతలను సచిన్ టెండూల్కర్ కు( Sachin Tendulkar ) అప్పగించింది ఐసీసీ.

 Icc Appoints Sachin Tendulkar As Brand Ambassador Of Odi World Cup 2023 Details,-TeluguStop.com

ప్రపంచ కప్ 2023 బ్రాండ్ అంబాసిడర్ గా సచిన్ టెండూల్కర్ నియమించినట్లు ఐసీసీ స్వయంగా ప్రకటించింది.గాడ్ ఆఫ్ క్రికెట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సచిన్ టెండుల్కర్ ఈ ప్రపంచకప్ టోర్నీలో సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు.

అక్టోబర్ ఐదు న గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్( Eng vs NZ ) మధ్య మ్యాచ్ ప్రారంభం అవ్వడానికి ముందు సచిన్ టెండూల్కర్ ప్రపంచకప్ ట్రోఫీతో మైదానంలోకి వస్తాడు.12 ఏళ్ల తర్వాత వన్డే వరల్డ్ కప్ ఈవెంట్ భారత్ వేదికగా జరుగుతున్న నేపథ్యంలో ఈ ఈవెంట్ ను సచిన్ ప్రారంభించనున్నారు.సచిన్ టెండుల్కర్ కెరియర్ విషయానికి వస్తే.ఆర్లు అంతర్జాతీయ ప్రపంచ కప్ లో పాల్గొన్నాడు.2011 ప్రపంచ కప్ ఛాంపియన్ గా నిలిచిన భారత జట్టులో సచిన్ కూడా భాగమయ్యాడు.

2019లో ప్రపంచ కప్ ఫైనల్ లో న్యూజిలాండ్ ను ఓడించి ఇంగ్లాండ్ ప్రపంచ కప్ టైటిల్ కైవసం చేసుకుంది.అక్టోబర్ ఐదు న ఈ రెండు జట్ల మధ్య జరిగే ఉత్కంఠ భరిత మ్యాచ్ తో వరల్డ్ కప్ ప్రారంభం అవ్వనుంది.భారత జట్టు( Team India ) తన తొలి మ్యాచ్ అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో తలపడనుంది.

ఇక అక్టోబర్ 14న గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్ – పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.భారత్ చివరిసారిగా 2011లో ప్రపంచ కప్ కు ఆతిథ్యం ఇచ్చింది.

మహేంద్రసింగ్ ధోని కెప్టెన్సీలో భారత్ సొంత గడ్డపై ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకను చిత్తుగా ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube