వన్డే వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్ గా సచిన్ టెండూల్కర్..!

భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్( ODI World Cup ) ప్రారంభం అవ్వడానికి మరికొన్ని గంటల సమయం ఉందని అందరికీ తెలిసిందే.

అయితే ప్రపంచ కప్ 2023 బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతలను సచిన్ టెండూల్కర్ కు( Sachin Tendulkar ) అప్పగించింది ఐసీసీ.

ప్రపంచ కప్ 2023 బ్రాండ్ అంబాసిడర్ గా సచిన్ టెండూల్కర్ నియమించినట్లు ఐసీసీ స్వయంగా ప్రకటించింది.

గాడ్ ఆఫ్ క్రికెట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సచిన్ టెండుల్కర్ ఈ ప్రపంచకప్ టోర్నీలో సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు.

"""/" / అక్టోబర్ ఐదు న గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్( Eng Vs NZ ) మధ్య మ్యాచ్ ప్రారంభం అవ్వడానికి ముందు సచిన్ టెండూల్కర్ ప్రపంచకప్ ట్రోఫీతో మైదానంలోకి వస్తాడు.

12 ఏళ్ల తర్వాత వన్డే వరల్డ్ కప్ ఈవెంట్ భారత్ వేదికగా జరుగుతున్న నేపథ్యంలో ఈ ఈవెంట్ ను సచిన్ ప్రారంభించనున్నారు.

సచిన్ టెండుల్కర్ కెరియర్ విషయానికి వస్తే.ఆర్లు అంతర్జాతీయ ప్రపంచ కప్ లో పాల్గొన్నాడు.

2011 ప్రపంచ కప్ ఛాంపియన్ గా నిలిచిన భారత జట్టులో సచిన్ కూడా భాగమయ్యాడు.

"""/" / 2019లో ప్రపంచ కప్ ఫైనల్ లో న్యూజిలాండ్ ను ఓడించి ఇంగ్లాండ్ ప్రపంచ కప్ టైటిల్ కైవసం చేసుకుంది.

అక్టోబర్ ఐదు న ఈ రెండు జట్ల మధ్య జరిగే ఉత్కంఠ భరిత మ్యాచ్ తో వరల్డ్ కప్ ప్రారంభం అవ్వనుంది.

భారత జట్టు( Team India ) తన తొలి మ్యాచ్ అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో తలపడనుంది.

ఇక అక్టోబర్ 14న గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్ - పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

భారత్ చివరిసారిగా 2011లో ప్రపంచ కప్ కు ఆతిథ్యం ఇచ్చింది.మహేంద్రసింగ్ ధోని కెప్టెన్సీలో భారత్ సొంత గడ్డపై ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకను చిత్తుగా ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది.

జుట్టు బలోపేతం కోసం ఈ కాఫీ హెయిర్ మాస్క్ ను తప్పక ట్రై చేయండి!