ఏపీలో అరాచక పాలన సాగుతోంది.రాష్ట్రాన్ని ఒక సైకో పాలిస్తున్నాడు.
పిచ్చోడి చేతికి రాష్ట్రాన్ని అప్పగించారు.మరో ఆరు నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించి అభివృద్దికి బాటాలు వేద్దాం.
ఇవి మొన్నటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) చేసిన వ్యాఖ్యలు కట్ చేస్తే ప్రస్తుతం స్కిల్ స్కామ్ లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.గత ఎన్నికల్లో ఎదురైన పరాభవాన్ని అధిగమించి ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదల ప్రదర్శించిన బాబు.
బహుశా స్కిల్ స్కామ్ జైలు పలు అవుతానని కలలో కూడా ఉంహించి ఉండడేమో.
ఈసారి జరిగే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని ఈ ఎన్నికల తరువాత తను రాజకీయాలకు విరామం తీసుకుంటానని చెప్పిన బాబు.ఊహించని విధంగా ఎన్నికల ముందే విరామం తీసుకునే పరిస్థితి ఏర్పడింది.ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్న చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారో చెప్పలేని పరిస్థితి.
స్కిల్ స్కామ్ లో పక్కా ఆధారాలతో చంద్రబాబు అరెస్ట్( Chandrababu arrested ) కావడం వల్ల.ఆయన తరుపు లాయర్లు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికి ఏపీ సిఐడి కౌంటర్ ఇస్తోంది.
మున్ముందు చంద్రబాబుపై మరిన్ని పీటీ వారెంట్లు కూడా మెపేందుకు సిద్దమౌతోంది.ఈ నేపథ్యంలో చంద్రబాబు జైలు కె పరిమితం కలల్సిందేనా అనే సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి.
మరోవైపు ఎన్నికలు ఎప్పుడు వస్తాయో అర్థంగాని పరిస్థితి ఏర్పడింది.
తాజా పరిణామాలు చూస్తుంటే షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరిగే అవకాశం కూడా ఉంది.ఇదే విషయాన్ని ఇటీవల వైసీపీ( YCP ) ప్రభుత్వం కూడా కన్ఫర్మ్ చేసింది.దాంతో ఎన్నికల సమయానికి బాబు బయటకు వస్తారా ? లేదా అనే డౌట్లు వ్యక్తమౌతున్నాయి, ప్రజెంట్ ఉన్న పరిస్థితులు చూస్తుంటే చంద్రబాబుకు మరో ఆరు నెలలు జైలు శిక్ష తప్పదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.దీంతో ఈసారి ఎన్నికల సమయమంతా చంద్రబాబు జైల్లోనే గడిపే అవకాశం ఉంది.దాంతో ఈ ప్రభావం టీడీపీకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.మొత్తానికి వచ్చే ఎన్నికలతో అధికారంలోకి రావాలని కలలు కన్నా బాబుకి స్కిల్ స్కామ్ ద్వారా ఊహించని విధంగా జగన్( CM jagan ) బ్రేకులు వేశారనేది కొందరి విశ్లేషకుల అభిప్రాయం.