తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అజాత శత్రువు ఎవరైనా ఉన్నారా అంటే అది విక్టరీ వెంకటేష్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.ఈయన ఇండస్ట్రీ లో అందరితో ఎంతో స్నేహం గా ఉంటాడు.
అలాగే విక్టరీ వెంకటేష్ ని అభిమానించని వారంటూ ఎవ్వరూ ఉండరు, ఆయన నటన అంటే ప్రతీ ఒక్కరికి ఇష్టమే.ఇక సినీ అభిమానుల్లో కూడా ప్రతీ ఒక్కరికి ఇష్టమైన ఫేవరెట్ హీరో మెయిన్ గా ఒకరు ఉంటారు.
కానీ వారందిరికి సెకండ్ ఫేవరెట్ హీరో గా వెంకటేష్( Venkatesh ) కచ్చితంగా ఉంటాడు.ఇక ఫ్యామిలీ ఆడియన్స్ లో అతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.
ఏ హీరో కి అయినా ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ వస్తే విక్టరీ వెంకటేష్ తో పోల్చి చూస్తారు.ఆ రేంజ్ బ్రాండ్ ఇమేజి ని ఏర్పాటు చేసుకున్నాడు.
ఇండస్ట్రీ లో విక్టరీ వెంకటేష్ కి ఎవరితోనూ ఎలాంటి సమస్యలు లేవు, కానీ ఒక హీరోయిన్ విషయం లో మాత్రం వెంకటేష్ మోసానికి గురి అయ్యాడట.ఆమె మరెవరో కాదు, కత్రినా కైఫ్( Katrina Kaif ).ఈమె మొట్టమొదటి సినిమా ‘మల్లీశ్వరి‘, ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాకనే ఆమెకి బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు వచ్చాయి, అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తర్వాత ఇటు వైపు కన్నెత్తి కూడా చూడలేదు.కానీ వెంకటేష్ తో మాత్రం చాలా సన్నిహితంగానే ఉండేదట.
అయితే అప్పట్లో వెంకటేష్ ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే( Aadavari Matalaku Arthale Verule )’ సినిమాకి కమిట్ అయ్యాడు.ఈ చిత్రం లో హీరోయిన్ గా ఎవరిని తీసుకుందాం అనే ఆలోచనలో డైరెక్టర్ సెల్వరాఘవన్ ఉండగా, వెంకటేష్ కత్రినా కైఫ్ ని తీసుకుందాం, నేను ఆమెతో మాట్లాడుతాను అని చెప్పాడట.
కత్రినా కైఫ్ ని అడగగా, ఆమె డేట్స్ కచ్చితంగా ఇస్తాను అని చెప్పిందట.
డేట్స్ ఇచ్చిందట కూడా, ఇక షూటింగ్ కి మొత్తం సిద్ధం చేసుకొని తొలి షాట్ విక్టరీ వెంకటేష్ మరియు కత్రినా కైఫ్ మధ్య ప్లాన్ చేసారు.వెంకటేష్ సెట్స్ కి వచ్చేసాడు కానీ, కత్రినా కైఫ్ మాత్రం రాలేదు.ఏమిటి రాలేదని డైరెక్టర్ సెల్వ రాఘవన్ కత్రినా కైఫ్ మ్యానేజర్ కి కాల్ చేస్తే ఆమె వేరే సినిమాకి డేట్స్ ఇచ్చి ఉంది, ఈ సినిమా చెయ్యడం లేదు అని చెప్పి కాల్ కట్ చేసాడట.
దీనితో సెల్వ రాఘవన్ కి కోపం కట్టలు తెంచుకుంది.ఇదే విషయాన్నీ వెంకటేష్ కి చెప్పగా, ఆయన నుండి కూడా ఇదే రియాక్షన్ వచ్చిందట.సినిమా చెయ్యడం ఇష్టం లేకపోతే, చెయ్యను అని చెప్పాలి కానీ, ఇలా నమ్మక ద్రోహం చేస్తుందా అని అప్పటి నుండి ఆయన కత్రినా కైఫ్ తో మాట్లాడడం మానేసాడట.ఆ తర్వాత ఆ పాత్ర ని త్రిష పోషించింది, రెస్పాన్స్ ఏ రేంజ్ లో వచ్చిందో అందరూ చూసారు.