వంచన, మోసాలకు పాల్పడితే ఏనాటికైనా శిక్ష తప్పదని మరోసారి రుజువైందని ఏపీ ప్రజలు భావిస్తున్నారట.నమ్మించి నట్టేట ముంచిన వ్యక్తికి తగిన శిక్ష పడిందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.
ఎందుకు అనుకుంటున్నారా.? స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఆయన అరెస్టు అనంతరం ఏపీ ప్రజల భావన ఇదేనంటూ పలు వాదనలు వినిపిస్తున్నాయి.
టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో నిరుద్యోగమే ఉండదని, తాను వస్తే జాబు వస్తుందని ప్రజలను చంద్రబాబు నమ్మించారు.
అంతేకాదు కంపెనీలు, పరిశ్రమలు ఏపీకి క్యూ కడతాయన్నారు.అందరూ తమ గ్రామాలు, పట్టణాలకు అత్యంత సమీపంలోనే ఉద్యోగాలు చేసుకోవచ్చాన్నారు.
అయితే దీనికి నైపుణ్యం లేకపోయిన ఫర్వాలేదని, ఉద్యోగాలకు కావాల్సిన స్కిల్స్ ను ప్రభుత్వమే నేర్పిస్తుందని కల్లబోల్లి మాటలు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు అక్కడి యువత.ఈ మాయమాటలను నమ్మేసిన పేద ప్రజలు తమ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో 2014లో చంద్రబాబును గెలిపించారన్నారు.
ఇంకేంముంది… అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలన్నీ గాలికి కొట్టుకుపోయాయి.అప్పటి టీడీపీ పాలకులు స్వలాభం చూసుకున్నారని ధ్వజమెత్తారు.
యువతకు జాబ్ ఇస్తామన్న మాట మేరకు లోకేశ్ ఒక్కడికీ మాత్రం మూడు శాఖల మంత్రిగా బాధ్యతలు అప్పజెప్పారు.ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మిగతా యూత్ కూడా తమకూ చిన్నవో పెద్దవో ఉద్యోగాలు వస్తాయని ఆశించారు.
కానీ నిరాశే ఎదురైంది.
ఆ సమయంలోనే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టాం.
నైపుణ్యాలు రాకెట్లా దూసుకెళ్తాయన్న టీడీపీ సర్కార్… ఉద్యోగాలు రావడమే ఆలస్యం అని చెప్పడంతో మరోసారి ఆశలు పెట్టుకున్నామన్నారు.కానీ అప్పుడు కూడా పేద ప్రజల నమ్మకాన్ని ఉపయోగించుకున్న నేతలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పేరిట ఎడాపెడా వందలకోట్లు మింగేశారని రాష్ట్ర యువత ఆరోపిస్తుంది.మొత్తం రూ.371 కోట్లను ఆ పథకానికి విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం డమ్మీ కంపెనీల పేరిట దోచుకున్నారని తెలుస్తోంది.ఈ కుంభకోణంపై విచారణ చేపట్టిన దర్యాప్తు సంస్థలు ఒక్కొక్కటిగా ఇందులోని మోసాలను గుర్తించాయని అర్థం అవుతుంది.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై విచారణ జరిపిన ఐటీ సంస్థ ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న చంద్రబాబుకు నోటీసులు ఇచ్చింది.
ఈ క్రమంలోనే నిధులు మళ్లించినట్లు నిర్దారణకు వచ్చిన అధికారులు చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు.ఎటువంటి నిబంధనలు పాటించకుండా డబ్బులు ఇచ్చేయండి అంటూ చంద్రబాబు చెప్పారని, అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు నోట్ ఫైల్స్ ఉన్నాయని తెలుస్తోంది.
ఇన్నేళ్లుగా ఎటువంటి అవినీతికి పాల్పడలేదని, తాను నిప్పునంటూ చెప్పుకుని తిరిగే చంద్రబాబు వేల కోట్ల రూపాయలను దోచుకున్నారని ఏపీ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.చేసిన పాపానికి ఏ రోజుకైనా శిక్ష తప్పదని చెబుతున్నారు.
అయితే చంద్రబాబు అరెస్టుపై రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ నేతలు కొందరు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ విమర్శలు చేస్తున్నారు.అంతేకాకుండా రాజకీయ ప్రమేయంతో కక్ష సాధింపుగా అరెస్ట్ చేయించారంటూ కొందరు వీరాభిమానులు ఎగురుతున్నారు.
అయితే రాజకీయ పరమైన వైరాలు న్యాయస్థానాలకు ఉండవన్న సంగతి అభిమానులు గుర్తించుకోవాలని కొందరు వ్యక్తులు చెబుతున్నారు.స్పష్టమైన ఆధారాలను , పత్రాలనూ చూసిన తరువాత సంపూర్ణంగా పరిశీలించి ఎక్కడ ఏయే స్థాయిల్లో అవినీతి జరిగిందో స్పష్టతకు వచ్చాకనే ఏ కోర్టు అయినా తీర్పు చెబుతుంది.
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో స్పందించిన ఏపీ యువత ఇది పేదల విజయంగా అభివర్ణిస్తున్నారని తెలుస్తోంది.తమను మోసం చేసిన పెత్తందారులను ఓడించేందుకు పేదల పక్షాన పోరాడుతూ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం సాధించిన విజయమని హర్షం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.
తప్పు చేసి ఇంతకాలం వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చిన చంద్రబాబుకు పాపం పండిందని, అందుకే శిక్ష తప్పలేదని వ్యాఖ్యానిస్తున్నారు.