పాలకూరను అతిగా తింటే.. ఈ ఆరోగ్య సమస్యలు తప్పవా..?

ముఖ్యంగా చెప్పాలంటే పాలకూర( Spinach )లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.దీన్ని తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

 Side Effects Of Eating Too Much Spinach,spinach,side Effects,palak Paneer,telugu-TeluguStop.com

అయితే ఇందులో ఉండే ఆక్సలేట్ కారణంగా అదే ఆరోగ్యం వికటించవచ్చు కూడా అని చెబుతున్నారు.అయితే పాలకూర తినకూడదా? మరి పాలకూరను ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.పాలకూరను సాధారణంగా సూపర్ ఫుడ్ అని అంటారు.ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.విటమిన్ సి, క్యాల్షియం, ఐరన్,యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.పాలకూర తినడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ( Immunity ) అద్భుతంగా పెరుగుతుంది.

అంతే కాకుండా ఎముకలు బలంగా మారుతాయి.

Telugu Tips, Heart, Palak Paneer, Effects, Effects Spinach, Spinach, Telugu-Telu

ముఖ్యంగా చెప్పాలంటే పాలకూరలో విటమిన్ కే( Vitamin K ) కూడా ఎక్కువగా ఉంటుంది.

ఇది ఎక్కువైతే శరీరం పై మందుల పని తీరు తగ్గిపోతుంది.ప్రత్యేకించి గుండెపోటు రోగులకు ఇచ్చే మందుల ప్రభావాన్ని ఇది తగ్గించేస్తుంది.దాని వల్ల ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది.అందుకే పాలకూర ఎక్కువగా తినకూడదు.

కిడ్నీలలో రాళ్లు ఉన్నవారు పాలకూరను ఎక్కువగా తింటే వారి ఆరోగ్యానికి అసలు మంచిది కాదు.ఇందులో ఆక్సలేట్ కారణంగా కిడ్నీలలో రాళ్ల సమస్య ఉత్పన్నం కావచ్చు.

ఫలితంగా యూరిన్ ద్వారా విస్తరితమయ్యే ఆక్సలేట్ రాళ్లుగా మారవచ్చు.


Telugu Tips, Heart, Palak Paneer, Effects, Effects Spinach, Spinach, Telugu-Telu

ఆక్సలేట్ ఎక్కువైతే శరీరానికి నష్టమే కలుగుతుంది.అందుకే పాలకూరను ఎక్కువగా తినకూడదని చెబుతున్నారు.ఇందులో ఉండే ఆక్సలేట్ కారణంగా రక్తం పల్చగా మారిపోతుంది.

ఫలితంగా అలసట, బలహీనత( Weakness ) వంటి సమస్యలు కూడా వస్తాయి.పాలకులను పచ్చిగా లేదా జ్యూస్ రూపంలో తీసుకుంటే ఆక్సలేట్ సమృద్ధిగా శరీరానికి అందుతుంది.

అంటే ఇది మరీ ప్రమాదకరం అందుకే పాలకూరను కుర రూపంలో లేదా ఫ్రై రూపంలో తీసుకుంటే మంచిది అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.అంతేకాకుండా పాలకూరలో పన్నీర్ లేదా పప్పు కాంబినేషన్ లో కూడా వండుకొని తినవచ్చు.

దీనివల్ల ఆక్సలేట్ ప్రమాదం కాస్త తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube