కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.ఈ క్రమంలో నియోజకవర్గానికి చెందిన కీలక నేత యార్లగడ్డ వెంకట్రావు ఇవాళ తన అనుచరులతో భేటీకానున్నారు.
నేటి సమావేశంలో టీడీపీలో చేరే అంశంపై యార్లగడ్డ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈనెల 22వ తేదీన గన్నవరంలో నారా లోకేశ్ పాదయాత్రతో పాటు బహిరంగ సభ ఉండనుంది.
అయితే ఆ రోజే లోకేశ్ సమక్షంలో యార్లగడ్డ టీడీపీలో చేరే అవకాశం ఉందని సమాచారం.మరోవైపు ఇప్పటికే చంద్రబాబును కలిసిన మాజీ ఎమ్మెల్సీ దాసరి బాలవర్ధనరావు నియోజకవర్గంలో తాజా పరిస్థితులపై చర్చించారని తెలుస్తోంది.
కాగా గత కొన్ని రోజులుగా వైసీపీపై అసంతృప్తితో ఉన్న యార్లగడ్డ టికెట్ తనకు కేటాయించకపోవడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.గన్నవరం నియోజకవర్గంలో అభ్యర్థిగా వల్లభనేని వంశీని ఇప్పటికే వైసీపీ అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే.