కుమార్తె బర్త్ డేను వినూత్నంగా నిర్వహించిన పేద తండ్రి.. నెటిజన్ల ప్రశంసలు

పిల్లల విషయంలో తల్లిదండ్రులు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు.పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆశ పడుతూ ఉంటారు.

 Auto Driver Celebrates Daughters Birthday By Giving Free Rides Details, Daughter-TeluguStop.com

పిల్లల పుట్టినరోజు( Birthday ) వేడుకలను ఘనంగా అందరినీ పిలిచి జరుపుతూ ఉంటారు.బర్త్ డే సందర్భంగా పిల్లలకు ఖరీదైన గిఫ్ట్‌లు ఇవ్వడం లాంటివి చేస్తారు.

ఇక కూతురు( Daughter ) పట్ల తండ్రికి ఎక్కు ప్రేమ ఉంటుంది.తండ్రితో కూతురికి ఎక్కువ అనుబంధం ఉంటే, తల్లితో కొడుకు అనుబంధం ఎక్కువగా ఉంటుంది.

పిల్లలకు ఏది కావాలంటే అది కొనివ్వడం లాంటివి చేస్తూ ఉంటారు.పిల్లల పుట్టిన రోజు వచ్చిందంటే లక్షలకు లక్షలు ఖర్చు చేస్తూ ఉంటారు.తమ దగ్గర ఆర్ధిక స్తోమత లేకపోయినా కొంతమంది తమ పరిస్ధితులకు తగ్గట్లు సెలబ్రేట్ చేస్తారు.తాజాగా ఒక ఆటో డ్రైవర్( Auto Driver ) తన కూతురు పుట్టినరోజుని వినూత్నంగా సెలబ్రేట్ చేశాడు.

కూతురు బర్త్ డే సందర్భంగా తన ఆటోలో ఫ్రీగా జర్నీ చేయవచ్చని ఆఫర్ పెట్టాడు.తాను ఈ రోజు ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోనని చెప్పారు.

ఆటో మీద ఫ్రీగా ఈ రోజు జర్నీ చేయవచ్చని ఒక పోస్టర్ అతికించాడు.ఐఎఎస్ అధికారి అవనీష్ శరన్( IAS Awanish Sharan ) ఈ పోస్టర్ ను ఎక్స్ ట్విట్టర్ లో షేర్ చేశారు.మనిషి మనస్సు గొప్పగా ఉండటానికి డబ్బులే ఉండనక్కర్లేదు.హ్యాపీ బర్త్ డే అర్పిత అంటూ క్యాప్షన్ ఇచ్చారు.ఈ పోస్టులో ఆటోపై వేసిన పోస్టర్ లో 11/08/2023 మా అమ్మాయి రాణి అర్పిత యాదవ్( Rani Arpita Yadav ) బర్త్ డే అని., ఈ శుభ సందర్భంలో ఈ రోజు తన ఆటోలో ఫ్రీగా తిరగొచ్చు.ఎటువంటి డబ్బులు ఇవ్వనవసరం లేదు.హ్యాపీ బర్త్ డే అని రాసి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube