రాబోవు కొన్ని నెలల్లో దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ తరుణంలోనే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలో నిలిచి గెలిచేందుకు సమాయత్తమవుతున్నాయి.
అయితే మధ్యప్రదేశ్, తెలంగాణ( Telangana ), రాజస్థాన్,చతిస్ఘడ్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.ఇందులో ప్రధానంగా చెప్పుకునేది మధ్యప్రదేశ్ ( Madhya pradesh ) మరియు రాజస్థాన్ రాష్ట్రాలు.
ఇవి విస్తీర్ణంలో కానీ రాజకీయంగా కానీ ఆసక్తి కలిగించేటువంటి రాష్ట్రాలు.అలాగే ఈ రాష్ట్రాల్లో ఎక్కువ పార్లమెంటు సీట్లు ఉంటాయి.
రాజస్థాన్ గురించి చెప్పుకోవాల్సి వస్తే మాత్రం ఎప్పుడైనా సరే ఒకసారి గెలిచినవారు మరోసారి గెలవడం లేదు.అక్కడి ప్రజలు కూడా చాలా తెలివిగా ఎన్నికల్లో నాయకులను ఎన్నుకుంటారు.
ఒక టర్మ్ లో కాంగ్రెస్ ( Congress ) ని ఎన్నుకుంటే మరో టర్మ్ లో బిజెపిని ఎన్నుకుంటూ వస్తున్నారు.ప్రస్తుతం కాంగ్రెస్ అక్కడ అధికారంలో ఉంది.అశోక్ గెహ్లాట్ సీఎంగా కొనసాగుతున్నారు.దాదాపు మూడు నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి.ఈ తరుణంలోనే రాజస్థాన్( Rajasthan ) రాజకీయాలపై ప్రతి ఒక్కరికి ఆసక్తి కలిగింది.పోయిన ఎన్నికల్లో ఆ సాంప్రదాయాన్ని తొలగించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది.
కానీ అక్కడ తగిన సీట్లు సాధించలేకపోయింది.అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
ఈ క్రమంలోనే మళ్లీ రాబోవు ఎన్నికల్లో ఎలాగైనా బిజెపి ( Bjp ) వస్తుందనేది అక్కడి వారి నమ్మకం.దీనికి ప్రధాన కారణం గత కొన్ని టర్ముల నుంచి ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది.
ఎప్పుడైనా ప్రధాన ప్రతిపక్షం అధికారంలోకి వస్తే, అధికార పక్షం ఓడిపోతుంది.
అలా ఎప్పుడు కూడా రెండు టర్మ్ లు ఏ పార్టీ గెలవకుండా అక్కడి ప్రజలు కూడా చాలా తెలివిగా ఓట్లు వేస్తున్నారు.మరి ఈసారి కూడా అలాగే జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు ఇతర కీలక నేతలు ఈ మధ్య కాలంలోనే బిజెపిలో చేరారు.
ఎన్నికలకు కొన్ని నెలలు ఉండగానే ఇలాంటి పరిణామాలు జరుగుతూ ఉండడంతో అక్కడ మళ్లీ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది.ఒకవేళ ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయితే మాత్రం తప్పకుండా బిజెపి అధికారంలోకి వస్తుంది.