తమిళ ఇండస్ట్రీలోని హీరోలు నేటివిటీకి దగ్గరగా సినిమాలు తీస్తారని అందరికి తెలిసిందే.ఈ విషయంపై చాలా మంది తమిళ ఇండస్ట్రీని( Kollywood ) పొగుడుతుంటారు కూడా.
అయితే అలా అని మన తెలుగువారు మంచి సినిమాలు తీయలేరని కాదు.సౌత్ ఇండియన్ సినిమాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళింది మన తెలుగు సినిమాలే.
కానీ ఇలాంటి సమయంలో కూడా కొంతమంది తెలుగు సీనియర్ హీరోలు మాత్రం ఇంకా మూస పద్ధతిలో కథలు ఎంచుకుంటూ, తమ వయసు దాచుకొని ఓవర్ మేకప్ వేసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్నారు.సీనియర్ హీరోలు( Senior Heros ) ఇలా చెయ్యడం తెలుగు ప్రేక్షకులు కూడా జీర్ణించుకోలేకున్నారు.
కానీ మన పక్క రాష్ట్రం హీరోలు మాత్రం అందానికి, వయసుకు అంతగా ప్రాధాన్యత ఇవ్వకుండా సినిమాకు తగ్గట్టుగా రెడీ అవుతుంటారు.వాళ్ళని చూసి మన తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ సీనియర్ హీరోలపై మరింత కోపం వస్తోంది.
అక్కడ అజిత్,( Ajith ) రజినీకాంత్( Rajinikanth ) లాంటి సీనియర్ హీరోలు ఎప్పుడూ కూడా తమ వయసును దాచుకోడానికి ప్రయత్నించరు.కథ డిమాండ్ చేస్తే ఎలాంటి మేకప్ అయినా వేసుకోడానికి రెడీ అవుతారు .సినిమా కథను బట్టి నెరసిన జుట్టు, తాత క్యారెక్టర్, కళ్లద్దాలు ఇలా వేటికైనా సిద్ధంగా ఉంటారు తమిళ హీరోలు.వాటికీ నిదర్శనమే ఇటీవల రిలీజ్ అయిన సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్ ‘ సినిమా.
( Jailer Movie ) ఈ సినిమాలో అనవసరమైన పాట ఒకటీ కూడా లేదు.ఒక హీరోయిన్ లేదు.అయినా రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ ఈ సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకున్నాడు.
కానీ మన తెలుగు హీరోలు మాత్రం ఇలాంటి సినిమాలో నటించడానికి ఊత్సాహం చూపించరు.మన మెగాస్టార్లు , సూపర్ స్టార్లు అలాంటి సినిమాలలో నటించడానికి ఒప్పుకోరు.నిజానికి మన స్టార్ హీరోలు ఎలా ఆలోచిస్తారంటే సినిమా అంటే అందులో ఒక ఐదు ఐటమ్ సాంగ్స్ పెట్టేస్తారు.
ఏదో ఒక పాటలో వాళ్ళు యంగ్ గా కనపడేలా చూసుకుంటారు.అయితే అందరూ తెలుగు హీరోలు( Telugu Heros ) ఇలానే ఉంటారు అని చెప్పలేము కానీ చాలామంది తెలుగు హీరోలు మాత్రం ఇలానే తయారవుతున్నారు.
అరవై ఏళ్ళ వయసులో కూడా వారు నటించే సినిమా లో కుర్ర హీరోయిన్లను తీసుకొని , ఐటమ్ సాంగ్ పెట్టుకుంటూ, మామూలు కథకి కూడా యంగ్ అండ్ ఎనర్జిటిక్ గెటప్ వేసుకొని తాము ఇంకా యంగ్ హీరోలే అన్నట్టు కవరింగ్ ఇస్తుంటారు.అలాంటివారి సినిమాలు వరసగా ఫ్లాప్ అయినా కూడా ఆ హీరోలు మారడం లేదు.కోట్లకు కోట్ల రెమ్యూనరేషన్లు ( Remuneration ) తీసుకోవడం దానికి పైగా అందంగా కనిపించడానికి మరింత డబ్బులు ఖర్చు పెట్టి ఎఫెక్ట్స్ పెట్టడం.మరి దానికి తగ్గట్టు సినిమా ఉంటుందా అంటే అది లేదు.
రొటీన్ సినిమాలు తీస్తూనే వుంటారు తప్ప, కొత్తగా ప్రయత్నం అన్నది చేయరు.
ఇది కవరింగ్ చేసుకోడానికి ఆడియో రిలీజ్ లో ఈవెంట్ లో మళ్ళీ ‘అభిమానులు నన్ను ఎలా చూడాలనుకుంటున్నారో ఈ సినిమాలో అలానే కనిపిస్తాను’ అంటూ ప్రతి హీరో చెబుతూ ఉంటారు.
ఈ ఓటీటీ తరుణంలో కూడా, అలానే మన తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సమయంలో కూడా, చాలామంది మన తెలుగు హీరోలు మారేటట్టు కనిపించడం లేదు.నిర్మాతలకు నష్టం టాలీవుడ్ ప్రేక్షకులకి కష్టం కలిగిస్తున్నారు ఈ హీరోలు.