నేడు, రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న సిఎం జగన్ ...

నేడు, రేపు సీఎం వైఎస్‌ జగన్‌( CM YS JAGAN )…అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల పర్యటన వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి బాధిత గ్రామాల ప్రజలతో నేరుగా మాట్లాడనున్న సీఎం వైఎస్‌ జగన్‌.

 Cm Ys Jagan Will Visit The Flood Affected Areas And Talk Directly To The People-TeluguStop.com

07.08.2023 షెడ్యూల్‌

ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఏఎస్‌ఆర్‌ జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట చేరుకుంటారు.అక్కడ గోదావరి వరదల ప్రభావిత ప్రాంతాలు, సహాయక చర్యలపై అధికారులతో మాట్లాడిన అనంతరం కూనవరం బస్‌స్టాండ్‌ సెంటర్‌లో కూనవరం, వీఆర్‌ పురం( V.R.Puram ) మండలాల వరద బాధితులతో సమావేశం అవుతారు.ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి కుక్కునూరు మండలం గొమ్ముగూడెం చేరుకుంటారు.అక్కడ వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ పరిశీలన అనంతరం వరద బాధిత కుటుంబాలతో సమావేశమవుతారు.

ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి రాజమహేంద్రవరం చేరుకుంటారు.అక్కడ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం తర్వాత రాత్రికి అక్కడే బస చేస్తారు

ఉదయం 9.10 గంటలకు రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కాలేజ్‌ గ్రౌం( Rajamahendravaram )డ్‌ నుంచి బయలుదేరి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గురజాపులంక చేరుకుంటారు.అక్కడ వరద బాధితులతో సమావేశం తర్వాత తానేలంక రామాలయంపేట గ్రామం చేరుకుంటారు.

అక్కడ వరద బాధితులతో సమావేశం తర్వాత అయినవిల్లి మండలం తోటరాముడివారిపేట, కొండుకుదురు చేరుకుంటారు.అక్కడ వరద బాధితులతో సమావేశం తర్వాత అక్కడి నుంచి బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube