మహిళలకు కేంద్రం అదిరిపోయే స్కీం అందించింది.సరికొత్త పథకాన్ని అమలు చేసింది.
ఇది ఇప్పుడు కాదు ఏప్రిల్ లోనే మొదలైంది.అసలు ఆ స్కీం ఏంటి, మహిళలకి ఎందుకు ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు చూసేద్దాం.
మహిళల కోసం కేంద్రం( Central Government ) సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ అనే ఒక స్కీంను అమల్లోకి తెచ్చింది.ఈ స్కీం ఏప్రిల్ 1 నుంచి అమలు అయ్యింది.
మహిళలు ఈ స్కీంలో 2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రెండేళ్లకు 30 వేలకు పైగా పొందొచ్చు.మహిళలు ఈ స్కీంలో 2 లక్షల వరకు దాచుకోవచ్చు.
ఈ స్కీం 2 ఏళ్ళు మాత్రమే.అంతేకాదు ఈ స్కీంపై 7.5 శాతం వడ్డీ పొందొచ్చు.దీంతో ఈ అదిరిపోయే స్కీంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు ఈ స్కీంలో పాక్షిక విత్‌డ్రాయెల్ ఫెసిలిటీ పొందొచ్చు.ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కూడా ఈ స్కీం అమల్లో ఉందని సమాచారం.అంతేకాదు ఈ స్కీం వాళ్ళ ఆకర్షణీయ వడ్డీ కూడా అందుతుంది.దీంతో మహిళలకి ఈ స్కీం అద్భుతంగా ఉంటుంది.మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్( Mahila Samman Saving Certificate )లో మీరు 2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే వడ్డీ ఏడాదికి రూ.15,427 లభిస్తాయి.రెండేళ్లకు రూ.32,044 వస్తాయి.అంటే రెండేళ్లలో మీరు పెట్టిన పెట్టుబడికి 32 వేలకు పైగానే పొందచ్చనమాట.పెద్ద అమౌంట్ కాకుండా మీరు 1000 రూపాయలతో ఈ స్కీంలో ఇన్వెస్ట్ చేయొచ్చు.
అయితే మీరు ఈ స్కీంలో ఒక్కసారి డిపాజిట్ చేసాక మళ్ళీ వెంటనే చేయడానికి కుదరదు.మళ్ళీ మీరు డిపాజిట్ చేయాలంటే కచ్చితంగా 3 నెలలు ఆగాల్సిందే.2 లక్షల వరకు మీరు ఎన్ని సార్లైనా డిపాజిట్ చేసుకోవచ్చు.అయితే ఈ స్కీంపై కేంద్రం కొత్త అప్డేట్ ఇచ్చింది.ఇప్పటివరకు ఈ స్కీంలో దాదాపు 14.83 లక్షల అకౌంట్లు ఓపెన్ అయినట్లు వెల్లడించింది.అంటే దాదాపు రూ.8630 కోట్లు డిపాజిట్( Deposit ) అయినట్టు.ఈ విషయాన్నీ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి చెప్పరు.మహిళలు ఈ స్కీంని సద్వినియోగం చేసుకోవాలని, అంతే కాదు ఈ పథకం రెండేళ్ల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది అని తెలిపారు.
ఈ స్కీంలో చేరాలనుకునే మహిళలు వెంటనే అకౌంట్ ఓపెన్ చేసుకొని, మంచి రాబడి పొందండి.