షర్మిల బరిలోకి దిగితే.. వైసీపీకి స్థానాలు గల్లంతే !

ఏపీలో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి.ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్ది సరికొత్త సమీకరణలు తెరపైకి వస్తున్నాయి.

 If Sharmila Comes To The Ring.. Ycp Will Lose Seats, Y. S. Sharmila, Ap Politics-TeluguStop.com

ముఖ్యంగా అధికార వైసీపీ ఎన్నికల వ్యూహాల్లో తలమునకలైంది.ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో కేవలం విజయం మాత్రమే కాకుండా ఏకంగా 175 స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంద.

అధినేత జగన్ కూడా అందుకు తగ్గట్టుగానే వ్యూహరచన చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.అయితే గెలుపు విషయంలో వైసీపీ పైకి కాన్ఫిడెంట్ గానే కనిపిస్తున్నప్పటికి లోలోపల కొంత భయంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఎందుకంటే ఎన్ని పథకాలు అమలు చేస్తున్నా.సంక్షేమంపై ఏ స్థాయిలో దృష్టి పెట్టిన ప్రజల్లో మాత్రం ఎంతో కొంత వ్యతిరేకత కనిపిస్తూనే ఉంది.

Telugu Ap, Cm Jagan, Congress, Revanth Reddy, Yssharmila, Ycp, Ys Jagan, Ys Shar

ఈ వ్యతిరేకతను ప్రత్యర్థి పార్టీలు భూతద్దం లో పెట్టి చూపిస్తున్నాయి.ఇదిలా ఉంచితే ఇప్పటి వరకు వచ్చిన సర్వేలు దాదాపు వైసీపీకి మిక్స్డ్ రిపోర్ట్ నే ఇచ్చాయి కొన్ని సర్వేలు వైసీపీ( YCP party )కి పట్టం కడితే.మరికొన్నేమో సీట్లు తగ్గే అవకాశం ఉందని హంగ్ ఏర్పడే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి.ఈ నేపథ్యం మరో కొత్త అంశం వైసీపీని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.ఏమిటంటే ఏపీలో కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు వైఎస్ షర్మిలను రంగంలోకి దించడం.గత కొన్నాళ్లుగా షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్ళే అవకాశం ఉందని గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ ( Congress party )లో చేరడంపై వస్తున్న వార్తలను అటు షర్మిల ( Y.S.Sharmila )కూడా ఖండించడం లేదు.దానికి తోడు షర్మిల కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దంగా ఉందని ఆ పార్టీ నేతలే స్పష్టం చేస్తున్నారు.

Telugu Ap, Cm Jagan, Congress, Revanth Reddy, Yssharmila, Ycp, Ys Jagan, Ys Shar

అయితే ఆమె టి కాంగ్రెస్ లో చేరతారా లేదా ఏపీ కాంగ్రెస్ లోకి వస్తారా అనేదే అసలు ప్రశ్న.టి కాంగ్రెస్ కు షర్మిల అవసరం లేదని రేవంత్ రెడ్డి ( Revanth Reddy )గతంలోనే స్పష్టం చేశారు.కాంగ్రెస్ హైకమాండ్ కూడా షర్మిల కాంగ్రెస్ లో చేరితే ఏపీ కాంగ్రెస్ బాద్యతలు అప్పటించే ఆలోచనలో ఉందట.ఒకవేళ ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల బాద్యతలు చేపటితే వైసీపీకి భారీ నష్టం చేకూరే అవకాశం ఉంది.

ఇదే విషయాన్ని ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇటీవల చెప్పుకొచ్చారు.ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఇస్తే ఈసారి ఎన్నికల్లో వైసీపీ 40 సీట్లు కూడా గెలవడం కష్టమేనని.

ఆరోజులు దగ్గలోనే ఉన్నాయని రఘురామ చెప్పుకొచ్చారు.మరి అన్నయ్య ను ఢీ కొట్టేందుకు షర్మిల సిద్దమౌతుందా ? అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube