పద్మినీ ఏకాదశి( Padmini Ekadashi ) కథ గురించి దాదాపు చాలా మందికి తెలుసు.త్రేతా యుగంలో కృత వీరుడు అనే శక్తివంతమైన రాజు ఉండేవాడు.
రాజుకు అనేక వివాహాలు జరిగాయి.అయినప్పటికీ అతనికి సంతానం లేదు.
సంతానం కోసం రాజు చాలా విచారించేవాడు.కఠినమైన తపస్సు కూడా చేశాడు.
రాణులు కూడా పిల్లల కోసం తపస్సు చేశారు.కానీ వారి తపస్సు కూడా ఫలించలేదు.
అటువంటి పరిస్థితిలో రాజు భార్యల్లో ఒకరైన పద్మినీ ఈ సమస్యకు పరిష్కారం చూపమని మాత అనసూయను అడుగుతుంది.
అప్పుడు అధిక మాసం శుక్ల పక్ష ఏకాదశి రోజు రాజుతో కలిసి ఉపవాసం చేయమని మాత అనసూయ చెబుతుంది.అధికమాసం శుక్లపక్ష ఏకాదశి రోజు ఉపవాసం( Fasting ) ఉండడం వల్ల ఆ కోరిక త్వరగా నెరవేరి విష్ణుమూర్తి( Vishnumoorthy ) సంతోషించి సంతానం ప్రసాదిస్తాడని మాత అనసూయ చెబుతుంది.ఈ సలహాకు అనుగుణంగా అధిక మాసం వచ్చినప్పుడు రాణి పద్మినీ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటుంది.
రోజంతా ఆహారం తీసుకోకుండా, రాత్రంతా మేలుకొని విష్ణుమూర్తిని ఆరాధిస్తుంది.రాణి పద్మినీ ఆచరించిన ఈ ఉపవాసానికి సంతోషించి శ్రీహరి ఆమెకు మగ బిడ్డను ప్రసాదిస్తాడు.
అలా రాణి పద్మినీ( Padmini ) ఉపవాసం ఆచరించిన ఏకాదశికి పద్మినీ ఏకాదశి అని పేరు వచ్చింది.ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెలలో 29వ తేదీన పద్మినీ ఏకాదశి నీ జరుపుకొనున్నారు.19 సంవత్సరాల తర్వాత ఈ రోజున బ్రహ్మయోగం ఏర్పడబోతోంది.ఈ రోజున ఉపవాసం ఆచరించే వారికి, ధనధర్మాలు చేసే వారికి పుణ్యఫలం లభిస్తుంది.ఈ రోజున విష్ణుమూర్తిని, శివుని ఆరాధించాలి.శివుడికి బిల్వ పత్రాన్ని సమర్పించాలి.విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవడానికి సాయంత్రం పూట తులసీమాతను ఆరాధించడం ఎంతో మంచిది.