కలర్ ఫోటో లాంటి అందమైన సినిమాకు కథ ఇచ్చిన ప్రముఖ రచయిత దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ”బేబీ( Baby movie )”.ఈ సినిమా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది.
జులై 14న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా యూత్ ఫుల్ లవ్ స్టోరీగా నిలిచింది.ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన ఈ మూవీ రికార్డ్ క్రియేట్ చేస్తుంది.

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది.నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో సినిమా ( Bro movie )రిలీజ్ అయిన కూడా బేబీ సినిమాను ఆపలేక పోతుంది.ఈ సినిమా ఇంకా థియేటర్స్ లో రన్ కొనసాగిస్తూనే ఉంది.మరి ఇంతటి సక్సెస్ఫుల్ సినిమాపై చాలా మంది ప్రముఖులు ఇప్పటికే ప్రశంసలు కురిపించారు.

ఇక తాజాగా బేబీ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) సైతం అభినందనలు అందించారు.ఈ విషయాన్నీ డైరెక్టర్ సాయి రాజేష్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసారు.మెగాస్టార్ చిరంజీవి బేబీ సినిమాను చూసి డైరెక్టర్ సాయి రాజేష్ ను నిర్మాత ఎస్ కె ను అభినందించారు.ఈ హ్యాపీ మూమెంట్ ను ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన కల నెరవేరింది అంటూ చెప్పుకొచ్చాడు.
అంతేకాదు బేబీ సినిమా త్వరలోనే గ్రాండ్ వేడుకలను నిర్వహించబోతుంది అని ఈ మెగా ఈవెంట్ లో ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారు అని ఇన్ డైరెక్ట్ గానే డైరెక్టర్ సాయి రాజేష్ కన్ఫర్మ్ చేయడంతో బేబీ కోసం మెగాస్టార్ రాబోతున్నాడు అని తెలుస్తుంది.మరి బేబీ మెగా ఈవెంట్ ఎప్పుడు ఎక్కడ నిర్వహించ బోతున్నారో ఇంకా ప్రకటించలేదు.







