గత కొంతకాలంగా భారతదేశంలో రాజకీయ పార్టీలన్ని ఏకమై ఇండియా ( india )అనే కూటమి ఏర్పరిచాయి.ఈ కూటమిలో భాగంగా అగ్ర నేత అయినటువంటి మల్లికార్జున ఖార్గే ఆధ్వర్యంలో సమావేశం ఏర్పరచుకున్నారు.
ఈ సందర్భంగా బిజెపి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రతిపక్ష పార్టీలన్నీ నిర్ణయానికి వచ్చినట్లు నామా నాగేశ్వరరావు ( nama nageshwar rao ) లోక్ సభలో మోడీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు.దీన్ని లోయర్ హౌస్ స్పీకర్ ఈరోజు పార్లమెంట్ లో పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
మరి ఆ విశేషాలు ఏంటో చూద్దాం.గత కొంతకాలంగా దేశంలో మణిపూర్ కల్లోలం గురించి చర్చ జరుగుతోంది.
ఈ అల్లర్లను నిలువరించడంలో మోడీ( modi ) సర్కార్ విఫలమైందని అన్ని రాష్ట్రాలలోని నాయకులు గళమెత్తుతున్నారు.ఇదే అంశాన్ని బేస్ చేసుకొని మోడీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని లోక్ సభలో కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గోగై నోటీస్ సమర్పించారు.ఈ యొక్క తీర్మానంపై 50 మంది ఎంపీలు సంతకం చేశారు.అంతేకాకుండా బిఆర్ఎస్( brs ) ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా దీనికి సంబంధించి నోటీస్ ఇచ్చారు.
మణిపూర్ లో( manipur ) జరుగుతున్న అల్లర్లపై పార్లమెంట్ లో ఎంతమంది ప్రశ్నించినా ప్రధాని మోడీ నోరు మెదపడం లేదని ప్రతిపక్షాలన్నీ కోపానికి వస్తున్నాయి.
ఈ యొక్క అవిశ్వాస తీర్మానం పెట్టడం ద్వారా ప్రధాని స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని, ఇతర అంశాలను లేవనెత్తడానికి అవకాశం ఉంటుందని “ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజిన్ అలయన్స్” అనుకుంటోంది.ఒకవేళ మీరు పెట్టిన తీర్మానం ఆమోదం పొందినట్లయితే బిజెపి( bjp ) సర్కార్ రాజీనామా చేయాల్సి ఉంటుంది.మొత్తం పార్లమెంటు సీట్లు 543 స్థానాలకు గాను ఒక ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
పార్లమెంట్ లో ఎన్డీఏ( nda ) ప్రభుత్వానికి 330 ఎంపీ సభ్యులుండగా, ఇందులో మెజారిటీ మార్కు 272 ఉన్నది.ఇండియా కూటమిగా ఏర్పడిన పార్టీలకు 150 మంది ఎంపీలు ఉన్నారు.
ఇక ఇందులో బీజేడీ( bjd ), వైసిపి( ycp ), బీఆర్ఎస్( brs ) పార్టీలు కలిపి మొత్తం 60 మంది ఎంపీలు ఉన్నారు.వీరంతా ఏ సైడ్ కూడా సపోర్ట్ చేయడం లేదు.
కానీ బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు మాత్రం అవిశ్వాస తీర్మానం కొరకు నోటీసు అందించారు.ఒకవేళ ఇండియా కూటమి ప్లాన్ వర్కవుట్ అయితే మాత్రం బిజెపి ప్రభుత్వం రాజీనామా చేయాల్సిందే.
మరి చూడాలి ఏం జరుగుతుందో.