సముద్రఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సాయి ధరంతేజ్( Sai Dharam Tej ) కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం బ్రో( Bro ) .జూలై 28వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాదులోని శిల్పకళా వేదికలో మంగళవారం సాయంత్రం ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వరుణ్ తేజ్ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ గురించి పలు విషయాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ బాబాయ్ సాయి ధరంతేజ్ కాంబినేషన్లో సినిమా వస్తుందని తెలియగానే తాను చాలా ఈర్ష పడ్డానని తెలిపారు.
అనంతరం వీరి కాంబినేషన్లో సినిమా అంటే చాలా సంతోషం వేసింది అని తెలిపారు.సాయిధరమ్ తేజ్ బాబాయిని ఒక గురువుగా భావిస్తారు.ఈ అవకాశం తనకే రావాలనిపించింది అందరికన్నా సాయి ధరమ్ తేజ్ కు చాలా ముఖ్యమైనది.
ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ బాబాయ్ మాకు చిన్నప్పటినుంచి చాలా స్వేచ్ఛ ఇచ్చారు.ఎప్పుడు కూడా మీరు ఇలాగే ఉండాలి ఇలాగే చేయాలని కండిషన్స్ పెట్టలేదు కానీ మీరు ఎంచుకున్న మార్గంలో మాత్రం విజయం సాధించాలని చెప్పారనీ వరుణ్ తేజ్( Varun Tej ) వెల్లడించారు.
ఇక ఆయన మెగా ఫ్యామిలీని వదిలిపెట్టి మిమ్మల్ని తన కుటుంబంగా భావించారు.ఇక బాబాయ్ రాజకీయాలలోకి వచ్చి ఎండా వాన ఇవేవీ లెక్క చేయకుండా ప్రజల కోసం తిరుగుతూ ఉన్నారు.అలాంటి సమయంలో మేము ఎందుకు ఆయన పక్కన లేము అని ఒక్కోసారి అనిపిస్తుంది కానీ బాబాయ్ ఏం చేసినా తాను రాజకీయాలలో ఉన్న సినిమాలలో కొనసాగిన మా ఫ్యామిలీ మద్దతు మాత్రం బాబాయ్ కి ఉంటుందని ఈ సందర్భంగా వరుణ్ తేజ్ పవన్ కళ్యాణ్ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక తాజాగా పవన్ బాబాయ్ నటించిన ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని వరుణ్ తేజ్ ధీమా వ్యక్తం చేశారు.