ఆ లిస్ట్ లో పేరు కోసం .. బీఆర్ఎస్ నేతల ఆత్రం మామూలుగా లేదు ! 

మరో నాలుగు నెలల్లో జరగబోతున్న తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో( Telangana Elections ) గెలిచేందుకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాల్లో మునిగిపోయాయి.వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని రకాల ఎత్తుగడలను అమలు చేస్తున్నారు.

 Tension In Brs Leaders To Get Party Ticket Details, Brs Party, Kcr, Telangana Cm-TeluguStop.com

ఇక అధికార పార్టీ బిఆర్ఎస్( BRS ) విషయానికి వస్తే మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉంది.తెలంగాణలో గెలిస్తేనే దేశవ్యాప్తంగా బిఆర్ఎస్ ప్రభావం ఉంటుందని ఆ పార్టీ అధినేత కేసిఆర్( KCR ) బలంగా నమ్ముతున్నారు.

అందుకే వచ్చే ఎన్నికల్లో  గెలుపు అవకాశాలు ఉన్నవారికి టికెట్లు ఖరారు చేయాలని నిర్ణయించుకున్నారు.ఇప్పటికే అనేక సర్వేలు నిర్వహించి నియోజకవర్గాల వారీగా బలమైన అభ్యర్థులను గుర్తించారు.

ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలామంది అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతోపాటు , 

ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవడంతో వారి స్థానాల్లో కొత్తవారిని ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నారు.ఈ మేరకు బీఆర్ఎస్ అభ్యర్థుల మొదటి జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం.

ఇదే విషయాన్ని కెసిఆర్ సైతం అనేక సందర్భాల్లో ప్రస్తావించారు .జూలై చివరి వారంలో మొదటి జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు బీఆర్ఎస్ కీలక నాయకులు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.దీంతో అందరిలో టెన్షన్ నెలకొంది .ఆ జాబితా ఎప్పుడు వస్తుంది? ఆ లిస్టులో తమ పేరు ఉందా లేదా అనే విషయంపై ఆరా తీసే పనిలోపడ్డారు.తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాలు ఉండగా, 

Telugu Brs Candis List, Brs Ministers, Brs, Brs Mlas, Cm Kcr, Congress, Telangan

బీఆర్ఎస్ కు 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.సర్వేలు, పనితీరు బట్టి టికెట్( BRS Ticket ) కేటాయిస్తామని కేసీఆర్ ప్రకటించడంతో , ఆశావాహులు అనేక సేవా కార్యక్రమాలు , పార్టీ కార్యక్రమాలతో తీరిక లేకుండా నిత్యం ప్రజల్లో ఉంటున్నారు.తొలి జాబితాలో తమ పేరు ఉంటుందని ఆశలు పెట్టుకున్నారు.తొలి జాబితాలో 70 నుంచి 80 మంది ఎమ్మెల్యేలను ప్రకటించే అవకాశం ఉండడంతో ఆశావాహులు ఎదురుచూపులు చూస్తున్నారు.కెసిఆర్ ప్రకటించబోయే మొదటి జాబితాలో పేరు ఉందా లేదా అని సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు,

Telugu Brs Candis List, Brs Ministers, Brs, Brs Mlas, Cm Kcr, Congress, Telangan

ఆశావాహులు, మంత్రులు బీఆర్ఎస్ కీలక నాయకులను ఆరా తీస్తూ, ఆ లిస్టు వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.మరికొంతమంది ప్రతిరోజు సీఎం ఆఫీసులో ఏం జరుగుతుందనే విషయంపై  ఆరాతీస్తూ కేసీఆర్ దగ్గర ఉన్న లిస్టులో తమ పేరు ఉందో లేదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.మరికొద్ది రోజుల్లో ప్రకటించబోయే మొదటి జాబితా పై రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ నాయకుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube