చాలామంది నటీనటులు ఇండస్ట్రీలో వెలుగు పోవాలని స్టార్ నటులుగా అందరి చేత గుర్తింపు పొందాలని ఉద్దేశంతోనే సినిమా ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు.తమ్ముడు డబ్బు సంపాదించక పోయిన పర్వాలేదు కానీ పదిమందితో మన నటన గుర్తుంచుకోవాలని, అలా గుర్తుపెట్టుకునే రకమైన పాత్రలను చెయ్యాలని కలలు కంటూ ఉంటారు.
ఇండస్ట్రీకి వందమంది నటులు కావాలని వస్తే అందులో సక్సెస్ అయ్యేది కేవలం పది మంది మాత్రమే.మళ్ళీ అందులో కూడా 1% మాత్రమే హీరోలుగా ఎదుగుతారు.
మిగతావారు సైడ్ క్యారెక్టర్స్, క్యారెక్టర్ పాత్రలు చేసి సర్దుకు పోవాల్సిందే.ఎంతో శ్రమిస్తే తప్ప క్యారెక్టర్ ఆర్టిస్టులు ( Character artists )మళ్లీ స్టార్ సెలబ్రిటీస్ గా మారే అవకాశం ఉండదు.
కానీ ఇవన్నీ జరగకుండానే ఒకటి లేదా రెండు అనామక పాత్రలు చేసి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయేవారు 90 శాతం మంది ఉంటారు.
ప్రస్తుతం మీరు స్క్రీన్ మీద చూస్తున్న నటుడు అలాగే ఎన్నో ఆశలతో ఇండస్ట్రీకి వచ్చాడు.కానీ తను అనుకున్న విధంగా ఏమీ జరగలేదు.ఒకటి రెండు సినిమాల్లో సైడ్ పాత్రలు, గుంపులో గోవింద పాత్రలు చేసి ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయాడు.
ప్రస్తుతం విజయవాడ ( Vijayawada )లో ఒక హోటల్ రన్ చేస్తున్నాడు.ఈ నటుడు గురించి అంతకు మించి ఏ వివరాలు కూడా లేవు.ప్రస్తుతం ఇతను వయసు బాగా పెరిగిపోయి ఇక నటన జీవితానికి స్వస్తి పలికాడు.విజయవాడలో పివిపి మాల్ పక్కన ఒక ఫుడ్ కోర్ట్ ఉంటుంది అందులోనే ఫుడ్ ఓ క్లాక్ ( Food o clock )అనే ఒక స్టాల్ ని నడిపిస్తున్నాడు.
ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్స్ టేస్ట్ చేయాల్సిందే అట.అంత అద్భుతంగా ఈ ఫుడ్ స్టాల్ నడిపిస్తున్న ఇతడు ఆర్య సినిమాలో గుండు బాబుగా నటించాడు.మరి కొన్ని సినిమాల్లో విలన్ గ్యాంగ్ లో కూడా కనిపించి ఆ తర్వాత ఇక ఇండస్ట్రీ తనకు వర్క్ ఔట్ కాదు అని తెలుసుకొని తన సొంత వూరు వెళ్లిపోయి సినిమాల వూసు లేకుండా మాస్టర్ గా మారిపోయి ఇడ్లీ, దోశలు వేస్తున్నాడు.అయితే చాలా మంది నటులు ఈ చిన్న విషయంలో క్లారిటీ లేక ఇండస్ట్రీలోనే తిరుగుతూ తమ జీవితాన్ని వృధా చేసుకుంటారు.