వైసిపి నాయకుడు, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి( Posani Krishna Murali ) గత కొంతకాలంగా రాజకీయంగా సైలెంట్ గా ఉంటున్నారు.మొదటి నుంచి వైసిపి పైనా, ప్రభుత్వం పైన ఎవరు విమర్శలు చేసినా, పోసాని విమర్శలతో విరుచుకుపడేవారు.
ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కౌంటర్లు ఇచ్చేందుకు పోసానినే వైసిపి( YCP ) రంగంలోకి దించేది.ఇదేవిధంగా ఓసారి వైసీపీకి మద్దతుగా పవన్ కళ్యాణ్ పై పోసాని పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
దీనికి రియాక్షన్ గా జనసేన నాయకులు పాసానిపై అంతే స్థాయిలో విమర్శలు చేయడంతో పాటు, ఆయనకు ఫోన్ కాల్స్, వాట్సప్ మెసేజ్ లు పంపుతూ అనే రకాలుగా వేధించారు.ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో పోసాని వెల్లడించారు.
ఇక ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పైన, ఆయన ఫ్యామిలీ పైన పోసాని విమర్శలు చేశారు ఇక ఆ తర్వాత నుంచి పోసానిపై జనసేన ఎటాక్ బాగా తగ్గిపోయింది.అలాగే పోసాని కూడా రాజకీయంగా సైలెంట్ అయిపోయారు.అయితే దీనికి కారణం కూడా ఉందట.పోసాని కృష్ణమురళి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉంటారు.ఎప్పుడైతే మెగా ఫ్యామిలీ పై ఆయన విమర్శలు చేయడం మొదలుపెట్టారో ఇక అప్పటి నుంచి ఆయనకు సినీ అవకాశాలు తగ్గిపోయాయట.దీనంతటికి కారణం మెగా ఫ్యామిలీని టచ్ చేయడమేననే విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన పోసాని పొలిటికల్ కామెంట్లు తగ్గించారు.
చాలా కాలం గ్యాప్ తీసుకుని మరోసారి మీడియా ముందుకు వచ్చారు.అయితే గతంలో మాదిరిగా పవన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయకుండా మాట్లాడుతున్నారు.
పవన్ మంచివాడేనని ఆయనను చంద్రబాబు( Chandrababu ) చెడగొడుతున్నాడు అన్నట్లుగా పోసాని వ్యాఖ్యానిస్తున్నారు.సీఎంగా జగన్ చాలా బాగా పనిచేస్తున్నారని , కానీ పవన్ చంద్రబాబు ను తప్పుదోవ పట్టిస్తున్నారని, వాస్తవాలు తెలుసుకోండి కళ్యాణ్ బాబు అంటూ నచ్చ చెప్పే విధంగా పోసాని మాట్లాడుతుండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.అయితే పోసాని లో అనూహ్యంగా మార్పు రావడానికి కారణం సినిమా అవకాశాలు తగ్గడమేనని, దీని వెనుక మెగా ఫ్యామిలీ చక్రం తిప్పిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ఏది ఏమైనా బహిరంగంగా పవన్ పై పోసాని విమర్శలు తగ్గించినా, తన సన్నిహితులు వద్ద మాత్రం పూర్వపు విధంగానే పవన్ పై విమర్శలతో విరుచుకుపడుతున్నారట.