కాంగ్రెస్ పై బీఆర్ఎస్ దుష్ఫ్రచారం చేస్తోందని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ హక్కు అని తెలిపారు.
వైఎస్ఆర్ 2004లో ఉమ్మడి రాష్ట్రానికి ఉచిత కరెంట్ ఇచ్చారన్నారు.తెలంగాణలో 24 లక్షల బోర్లకు ఉచిత కరెంట్ ఉపయోగపడిందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ధనిక రాష్ట్రం.సంపద బాగా ఉన్న రాష్ట్రమని చెప్పారు.
నాణ్యమైన విద్యుత్ ను రైతులకు ఉచితంగా ఇస్తామని స్పష్టం చేశారు.ఉచిత విద్యుత్ పై ఒక్క అడుగు కూడా వెనక్కి వేయమని వెల్లడించారు.