'జూ'లో షాకింగ్ ఘటన.. తొలిసారి తన బిడ్డను తినేసిన కోతి..

ప్రపంచంలో పాములు, కొన్ని రకాల చేపలు మాత్రమే తమ బిడ్డలను తింటాయి.మనుషులతో సహా ఏ జీవి తమ బిడ్డలను తినేందుకు ఇష్టపడవు.

 Shocking Incident In 'zoo'monkey Ate Its Baby For The First Time , Monkey, Monke-TeluguStop.com

ముఖ్యంగా అన్ని జంతువులలో మాతృత్వం అనేది కనిపిస్తుంది.తమ బిడ్డకు ఏదైనా ఆపద వస్తే ఏ జంతువైనా కాపాడడానికే ప్రయత్నిస్తుంది.

ముఖ్యంగా మనం కోతులను( Monkeys ) చూసినప్పుడు ఈ విషయం అర్థం అవుతుంది.తమ బిడ్డలను అవి చాలా అపురూపంగా చూసుకుంటాయి.

తమ కళ్ల ముందు బిడ్డలు చనిపోయినప్పుడు కోతులు హృదయ విదారకంగా రోదిస్తాయి.అయితే ఇటీవల ప్రపంచంలోనే అరుదైన సంఘటన జరిగింది.

యూరప్‌లోని చెక్ రిపబ్లిక్‌లోని( Czech Republic in Europe ) జంతుప్రదర్శనశాలకు చెందిన కోతి చనిపోయిన తన బిడ్డ మృతదేహాన్ని తినేసింది.చనిపోయిన చాలా రోజుల పాటు తన శిశువు మృతదేహాన్ని మోసుకెళ్లింది.

పిల్ల కోతి( baby monkey ) మరణించిన తరువాత, తన బిడ్డ శవాన్ని దాదాపు రెండు రోజుల పాటు తన ఎన్‌క్లోజర్ చుట్టూ మోసుకెళ్లింది.మృతదేహాన్ని బయటకు తీయకుండా జూ కీపర్లను( Zoo keepers ) ఆ కోతి అడ్డుకుంది.రెండవ రోజు ముగిసే సమయానికి, కోతి తన చనిపోయిన బిడ్డను తినడం ప్రారంభించడంతో అంతా భయపడ్డారు.అయితే ఆ చనిపోయిన కోతి పిల్ల శవాన్ని జూ కీపర్లు తీశారు.

అప్పటికే చాలా భాగాన్ని ఆ తల్లి కోతి తినేసింది.డ్రిల్ ట్రూప్‌ను అధ్యయనం చేస్తున్న పరిశోధకులు మొత్తం సంఘటనను డాక్యుమెంట్ చేశారు.

డ్రిల్ ట్రూప్‌ను అధ్యయనం చేస్తున్న పరిశోధకుల బృందం జూన్ 27న ప్రైమేట్స్ జర్నల్‌లో( Journal of Primates ) ప్రచురించిన ఒక అధ్యయనంలో ఈ సంఘటన గురించి వివరించింది.కోతి తన బిడ్డను తింటున్న వీడియోలను కూడా వారు పంచుకున్నారు.

తన బిడ్డ మరణించిన తర్వాత దానిని రెండు రోజులు తన వద్దే ఆ కోతి ఉంచుకుందని, దానిని జూ కీపర్లు పరిశీలించడానికి వచ్చినప్పుడు అది ఒప్పుకోలేదని వారు పేరు్కొన్నారు.తన బిడ్డ చనిపోయిందని అంగీకరించడానికి ఇష్టపడకపోవచ్చని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube