ప్రముఖ యూపీఐ పేమెంట్ యాప్ అయిన గూగుల్ పే( Google pay ) తమ యూజర్లకు గుడ్ న్యూస్ అందించింది.తమ యూజర్లను ఆకట్టుకునేందుకు, కొత్త యూజర్లను తెచ్చుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది.
అందులో భాగంగా అనేక ఆఫర్లు, డిస్కౌంట్‌లు ప్రకటిస్తోంది.ఈ క్రమంలో తాజాగా భారీగా క్యాష్ బ్యాక్‌లు అందిస్తోంది.
ఏకంగా రూ.వెయ్యి వరకు క్యాష్ బ్యాక్ ఇస్తోంది.ఇప్పటికే పలువురు యూజర్లకు ఈ క్యాష్ బ్యాక్‌లు వస్తున్నాయి.
గతంలో ఏదైనా నగదు లావాదేవీ జరిపినందుకు గూగుల్ పే క్యాష్ బ్యాక్( Cash Back Google Pay Cash Back ) అందించేది.నగదు లావాదేవీని బట్టి క్యాష్ బ్యాక్ ఇచ్చేది.ఒక్కొక్కసారి కొంతమంది యూజర్లకు పెద్ద మొత్తంలో డబ్బులు తిరిగి వచ్చేవి.కానీ ఆ తర్వాత దీనిని గూగుల్ పే నిలిపివేసింది.కేవలం వోచర్ల రూపంలో మాత్రమే క్యాష్ బ్యాక్ ఇస్తుంది.అయితే ఇప్పుడు మళ్లీ నేరుగా క్యాష్ బ్యాక్ రూపంలో నగదును ఇస్తోంది.
రూ.వెయ్యి వరకు కూడా అటుఇటుగా క్యాష్ బ్యాక్ వస్తుంది.ఎక్కువ లావాదేవీలు జరిపిన వారికి మాత్రమే ఈ క్యాష్ బ్యాక్ ను అందిస్తోంది.
గతంలో రూ.లక్ష వరకు కూడా నగదు లావాదేవీలను బట్టి గూగుల్ పే క్యాష్ బ్యాక్( Cash back ) ఇచ్చేది.రూ.50 వేలు, రూ.లక్ష క్యాష్ బ్యాక్ వచ్చిన సంఘటలనకు సంబంధించిన వార్తలు కూడా మీడియాలో వచ్చేవి.కొంతమందికి బెటర్ లక్ నెక్ట్స్ టైమ్ అని కూడా వచ్చేది.
కానీ కొద్దిరోజుల తర్వాత దీనిని గూగుల్ పే నిలిపివేసింది.నగదు లావాదేవీ జరిపినట్లు కేవలం కూపన్లను మాత్రమే అందిస్తోంది.
ఈ కూపన్ల ద్వారా రకరకాల ప్రొడక్ట్స్ పై డిస్కౌంట్ ఆఫర్లు వచ్చేవి.కానీ ఈ కూపన్లు ఎక్కువగా ఉపయోగపడటం లేదు.
కేవలం ప్రమోషనల్ పరంగానే ఈ కూపన్లను గూగుల్ పే అందిస్తోంది.