నాగశౌర్య రంగబలి డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ!

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య( Naga Shaurya ) ప్రధాన పాత్రలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం రంగబలి( Rangabali ) .జూలై 7వ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్స్ తో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది.

 Nagashaurya Rangabali Is A Famous Ott ,naga Shaurya, Rangabali ,pawan Basam She-TeluguStop.com

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సినిమాపై భారీ హైప్ పెంచేశారు.దీంతో మొదటి రోజు టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది.

ప్రస్తుతం యావరేజ్ టాక్ తో థియేటర్లలో రన్ అవుతున్నటువంటి ఈ సినిమా డిజిటల్ రైట్స్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది./br>

ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ( Net Flix )భారీ ధరలకు కొనుగోలు చేశారని తెలుస్తోంది.ఈ సినిమా థియేటర్ రన్ పూర్తి అయిన తర్వాత తిరిగి ఓటీటీ లో విడుదల అయ్యి ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ప్రకటించారు.ఇక నాగశౌర్యకు ఉన్నటువంటి క్రేజ్ దృష్టిలో పెట్టుకొని నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను దాదాపు ఏడు కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని తెలుస్తోంది.

ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగస్టు 2వ వారం లేదా మూడో వారంలో డిజిటల్ మీడియాలో ప్రసారం కాబోతుంది అని తెలుస్తుంది./br>

ఇక ఈ సినిమా ద్వారా నూతన దర్శకుడు పవన్ బసంశెట్టి ( Pawan Basam Shetty ) ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయమయ్యారు.అలాగే ఈ సినిమాలో నాగశౌర్య సరసన యుక్తి తరేజ హీరోయిన్ గా నటించారు.ఇక ఈ సినిమాలో నాగశౌర్య నటనతో పాటు సత్య కామెడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమాని లక్ష్మీ వెంకటేశ్వర సినీ పతాకం పై నిర్మాత చెరుకూరి సుధాకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.ప్రస్తుతం యావరేజ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా కమర్షియల్ గా ఎలాంటి సక్సెస్ అందుకుంటున్న తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube