టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ) బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం మనందరికీ తెలిసిందే.బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు.
కానీ ఇందులో ఏ ఒక్క సినిమా కూడా ఆశించిన విధంగా సక్సెస్ ను సాధించలేకపోయాయి.బాహుబలి తర్వాత విడుదలైన సాహో,( Saaho ) రాధేశ్యామ్ సినిమాలు రెండు కూడా నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం పరవాలేదు అనిపించాలి.
తాజాగా విడుదలైన ఆదిపురుష్ సినిమా కూడా భారీగా కలెక్షన్స్ ను సాధించింది.
కానీ మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది.ఇకపోతే ప్రభాస్ తాజాగా నటించిన మూవీ సలార్.( Salaar ) త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఇది ఇలా ఉంటే తాజాగా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ( Vivek agnihotri )సలార్ టీజర్‌ను లౌడ్ సౌండ్‌తో కూడిన నాన్సెన్స్ యాక్షన్‌గా పేర్కొన్నారు.
అంతేకాదు ప్రభాస్ పేరు ఎత్తకుండా అతని యాక్టింగ్‌పై చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.అగ్నిహోత్రి తన ట్వీట్ లో ఈ విధంగా రాసుకొచ్చారు.
ఎవరు హింసాత్మకంగా పుట్టరు.మీ పిల్లల మైండ్స్ ను శాంతివైపు ప్రేరేపించాల్సిన ఇండస్ట్రీ ప్రముఖులు ప్రసిద్ధ సాహిత్యం, సినీ రాజకీయాల్లోని హింసను గ్లామరైజ్ చేయడం ద్వారా మార్చేస్తున్నారు.
ఇలాంటి హింసాత్మక ప్రపంచంలో సృజనాత్మక స్పృహ మాత్రమే పరిష్కారం అని తెలిపారు.దీనికి కొనసాగింపుగా మరో ట్వీట్ చేస్తూ ఇప్పుడు సినిమాల్లో మితిమీరిన హింసను గ్లామరైజ్ చేయడం, అర్థంలేని సినిమాలను ప్రమోట్ చేయడం కూడా టాలెంట్‌గా పరిగణిస్తున్నారు.అసలు నటుడే కాని వ్యక్తిని బిగ్గెస్ట్ స్టార్‌గా ప్రమోట్ చేయడాన్ని అతిపెద్ద టాలెంట్‌గా గుర్తిస్తున్నారు.ఇక ప్రేక్షకులకు ఏమీ తెలియదని భావించడమైతే అన్నింటికంటే పెద్ద టాలెంట్ అంటూ ప్రభాస్ ని ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
కాగా ఇటీవలె విడుదల అయిన సలార్ టీజర్ విడుదల కాగా అందులో వైలెన్స్ ఎక్కువగానే చూపించారు.ఇదే విషయాన్ని ఇన్‌డైరెక్ట్‌గా ప్రస్తావిస్తూ సలార్ మూవీపై, ప్రభాస్ నటనపై వివేక్ అగ్నహోత్రి ఈ తరహా కామెంట్స్ చేశారు.
కాగా ప్రభాస్ నటించిన ఈ సలార్ సినిమా సెప్టెంబర్ 28 న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానున్న విషయం తెలిసిందే.