ఉచిత బస్సు ప్రయాణం కోసం మరీ ఇంతలా దిగజారిపోవాలా..? బుర్ఖా ధరించి మరీ..

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ ( Congress party )అనేక వరాలు ఇచ్చింది.అందులో కీలకమైనది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.

 Do You Have To Stoop So Low For A Free Bus Ride Wearing Burkha Too , Free Bus, M-TeluguStop.com

ఈ హామీని తమ మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ పెట్టింది.కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంతో ఈ హామీ బాగా పనిచేసింది.

అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే ఈ హామీని అమల్లోకి తీసుకొచ్చారు.దీంతో ప్రస్తుతం కర్ణాటకలో ( Karnataka )మహిళలకు అక్కడ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు.

Telugu Bus, Latest-Latest News - Telugu

అయితే ఉచిత బస్సు ప్రయాణం( Free bus travel ) కోసం కొంతమంది వేస్తున్న విచిత్ర వేషాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.బస్సుల్లో ఉచిత జర్నీ కోసం ఒక పురుషుడు ఏకంగా మహిళల మాదిరిగా వేషం వేశాడు.ఒక హిందూ వ్యక్తి బుర్ఖా ధరించి మహిళ అనుకునేలా వేషం మార్చాడు.కానీ చివరకు కొంతమంది గుర్తు పట్టడంతో అతటి గుట్టు బయటపడింది.వీరభద్రయ్య మఠాపతి( Veerabhadrayya Mathapati ) అనే వ్యక్తి బుర్ఖా ధరించి బస్టాండ్‌లో వెయిట్ చేస్తున్నారు.అతడి వాలకం వేరేలా అనిపించడంతో కొంతమంది ప్రశ్నించారు.

దీంతో అతడి పురుషుడని తేలింది.

Telugu Bus, Latest-Latest News - Telugu

బుర్ఖా ఎందుకు ధరించావు అని అతడిని ప్రశ్నించారు.భిక్షాటన చేయడం కోసమని బుర్ఖా ధరించినట్లు చెప్పాడు.కానీ అతడి వద్ద మహిళకు చెందిన ఒక ఆధార్ కార్డు కనిపించడంతో.

ఉచిత బస్సు ప్రయాణం చేసేందుకు ఇలా మహిళగా వేషం మార్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కాగా జూన్ 11న శక్తి యోజన పేరుతో మహిళకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కర్ణాటక ప్రభుత్వం ప్రారంభించింది.

అయితే ఈ పథకం ప్రవేశపెట్టిన దగ్గర నుంచి అభాసు పాలవుతుంది.ఉచిత బస్సు ప్రయాణం కోసం ఇలా కొంతమంది వేస్తున్న వేషాలలు వేస్తుండటం ఆసక్తికరంగా మారుతున్నాయి.

ఇంతకుముందు ఇలాంటి ఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి.దీంతో ఇంతలా దిగజారిపోవాలా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube