ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరంగల్ లో పర్యటించనున్నారు.ఇప్పటికే మూమునూర్ ఎయిర్ పోర్టు నుంచి ఓరుగల్లుకు చేరుకున్నారు.
ఈ క్రమంలో ముందుగా భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్స్ కు చేరుకుంటారున.
అక్కడే జాతీయ రహదారుల విస్తరణ మరియు రైల్వేవ్యాగన్ల ఉత్పత్తి పరిశ్రమకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.అదేవిధంగా పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన తరువాత బీజేపీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు.







