భారతీయ జంటను హత్య చేసిన కేసులో మరణశిక్షను ఎదుర్కొంటున్న పాక్ జాతీయుడి అప్పీల్‌ను తోసిపుచ్చింది దుబాయ్( Dubai ) అత్యున్నత న్యాయస్థానం.వివరాల్లోకి వెళితే.2020లో గుజరాత్‌కు చెందిన వ్యాపారవేత్త హిరేన్ అధియా( Hiren Adhia ), అతని భార్య విధిని నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న 28 ఏళ్ల పాక్ జాతీయుడు హత్య చేశాడు.ఈ కేసులో దోషిగా తేలిన అనంతరం నిందితుడికి దుబాయ్ క్రిమినల్ కోర్టు గతేడాది ఏప్రిల్‌లో మరణశిక్ష విధించింది.
హిరేన్ దంపతులను తాను ఉద్దేశపూర్వకంగా హత్య చేయలేదని అందువల్ల మరణశిక్షను ఎత్తివేయాలని నిందితుడు దాఖలు చేసిన పిటిషన్‌లను దుబాయ్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ గతేడాది నవంబర్‌లో తిరస్కరించింది.
ఎమిరేట్స్ అత్యున్నత న్యాయస్థానమైన దుబాయ్ కోర్ట్ ఆఫ్ కాసేషన్( Dubai Court of Cassation ), క్రిమినల్ ప్రొసీజర్స్ చట్టం ప్రకారం.
దుబాయ్ వైస్ ప్రెసిడెంట్, రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్( Sheikh Mohammed bin Rashid ) ఆమోదముద్ర వేసిన తర్వాతే ఉరిశిక్షను అమలు చేస్తారు.ఇప్పటికే ఈ కేసులో నిందితుడి అప్పీల్‌ను దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ , దుబాయ్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ రెండూ తిరస్కరించాయి.
ప్రారంభ విచారణ సందర్భంగా అరేబియా రాంచెస్‌లోని మిరాడోర్‌లోని హిరేన్ దంపతుల ఇంటి వెలుపల ఆరు గంటల పాటు దాక్కున్న నిందితుడు డాబా డోర్ ద్వారా ఇంటిలోకి చొరబడ్డారని న్యాయమూర్తులు చెప్పారు.నిందితుడు 1,965 దిర్హామ్‌లు (అమెరికా కరెన్సీలో 535 డాలర్లు) విలువైన వాలెట్‌ని దొంగిలించి, మరిన్ని విలువైన వస్తువుల కోసం వెతుకుతూ దంపతుల బెడ్‌రూమ్‌కి వెళ్లాడు.
హిరేన్ నిద్రలేచి చూసేసరికి భార్యపై దాడికి దిగిన నిందితుడు అతనిని కూడా కత్తితో పొడిచి చంపాడు.ఫోరెన్సిక్( Forensic ) నివేదికల ప్రకారం.హిరేన్ తల, ఛాతీ, పొత్తికడుపు, ఎడమ భుజంపై పదిసార్లు కత్తితో పొడిచినట్లు పోస్ట్‌మార్టం నివేదిక తెలిపింది.అలాగే విధి తల, మెడ, ఛాతీ, ముఖం, చెవి, కుడి చేయిపై 14 సార్లు కత్తితో పొడిచాడు.
స్వల్ప గాయాలతో బయటపడిన వారి పెద్ద కుమార్తె దుబాయ్ పోలీసులకు ఫోన్ చేయగలిగింది.రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని 24 గంటల్లోపే షార్జాలో అరెస్ట్ చేశారు.జంట హత్యలు, వారి కుమార్తెపై హత్యాయత్నం, దొంగతనం నేరాన్ని నిందితుడు అంగీకరించాడు.
2019 డిసెంబర్‌లో ఇంటి మెయింటెనెన్స్ పనుల కోసం హిరేన్ ఇంట్లో పనిచేసిన వారిలో నిందితుడు ఒకడు.ఆ సమయంలో మృతుల ఇంట్లో నగదు, విలువైన వస్తువులు కనిపించడంతో దొంగతనానికి స్కెచ్ గీశాడు.అయితే పోలీసుల విచారణలో పాకిస్తాన్‌లో( Pakistan ) ఉన్న తల్లి అనారోగ్యానికి గురైందని, ఆమెకు డబ్బు అందజేయాలనే ఉద్దేశంతోనే దొంగతనం చేసినట్లు తెలిపాడు.
మృతుల కుమార్తె మాట్లాడుతూ.అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో తన తల్లిదండ్రుల బెడ్‌రూమ్ నుంచి కేకలు వినిపించాయని న్యాయమూర్తులకు తెలిపింది.తాను కంగారుగా పరుగులు తీస్తూ వుండగా.
నిందితుడు పారిపోతూ తనపైనా హత్యాయత్నం చేయబోయాడని న్యాయమూర్తులతో చెప్పింది.