వాట్సాప్ అదిరిపోయే అప్‌డేట్.. ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా!

ప్రముఖ మెసేజింగ్ దిగ్గజ యాప్ వాట్సాప్( WhatsApp ) ఎప్పటికప్పుడు తన యూజర్లను సంతృప్తి పరచడానికి రకరకాల ఫీచర్లను పరిచయం చేస్తోంది.మెటీరియల్ డిజైన్ 3 గైడ్‌లైన్స్ ప్రకారం ఆండ్రాయిడ్ యాప్‌లో కీలక మార్పులు చేస్తున్నట్టు కూడా సమాచారం.

 Whatsapp's Exciting Update Now More Attractive, Whatsapp, New Interface, Whatsap-TeluguStop.com

ఇందులో భాగంగా ఇటీవల రౌండెడ్ రీడిజైన్డ్‌ స్విచ్‌లు( Rounded redesigned switches ), రౌండెడ్ ఫ్లోటింగ్ యాక్షన్ బటన్లు వంటి ఫీచర్లను వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటాలో రిలీజ్ చేయడం విశేషం.తాజాగా ఈ పోర్టల్ మరోసారి ఆండ్రాయిడ్ యాప్ ఇంటర్‌ఫేస్‌ను అప్‌డేట్ చేసింది.

ఇప్పుడు కొత్తగా రౌండెడ్ అలర్ట్స్ అందుబాటులోకి వచ్చాయి.లేటెస్ట్ అప్‌డేట్ ప్రస్తుతం బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా త్వరలో అందరికీ అందుబాటులోకి రావచ్చని వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ వాబీటాఇన్ఫో( wabetainfo ) తెలిపింది.

Telugu Interface, Switches, Whatsapp-Technology Telugu

మెటీరియల్ డిజైన్ 3 అనేది గూగుల్ డిజైన్ సిస్టమ్‌కి చెందిన సరికొత్త వెర్షన్.ఇది మెరుగైన యూజర్ ఇంటర్‌ఫేస్ డిజైన్ పద్ధతులను ఉపయోగించడాన్ని ప్రోత్సహించే ఒక ఓపెన్ సోర్స్ ఫ్రేమ్‌వర్క్.దీనికి అనుగుణంగా వాట్సాప్ యాప్ ఇంటర్‌ఫేస్‌ను ఆకర్షణీయంగా మారుస్తుండడం విశేషం.గతంలో స్విచ్‌లను మెటీరియల్ డిజైన్ 3తో మరింత స్థిరంగా ఉండేలా రీడిజైన్ చేసింది.ఫ్లోటింగ్ యాక్షన్ బటన్లను కూడా వాట్సాప్ రీడిజైన్ చేస్తోంది.అవి ఇప్పటి షేప్‌తో పోలిస్తే మరింత గుండ్రంగా కనిపిస్తూ ట్యాప్ చేయడానికి సులభంగా ఉంటాయన్నమాట.

ప్రస్తుతం ఈ 3 రౌండెడ్ డిజైన్లు బీటా వెర్షన్‌లోనే అందుబాటులో ఉన్నాయి.

Telugu Interface, Switches, Whatsapp-Technology Telugu

వాబీటాఇన్ఫో ప్రకారం, వాట్సాప్ బీటా 2.23.14.12 అప్‌డేట్‌లో 3 మార్గదర్శకాలకు సరిపోయేలా అలర్ట్స్‌, డైలాగ్‌లు మారాయి.వాబీటాఇన్ఫో తాజాగా షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం చూస్తే, ఈ అప్‌డేట్‌ యాప్‌కు ఫ్రెష్ లుక్ అనేది ఇస్తుంది.

ఈ కొత్త ఇంటర్‌ఫేస్ యాక్సెస్ చేయాలనుకునేవారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా లేటెస్ట్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవలసి ఉంటుంది.దీన్ని ఇన్‌స్టాల్ చేసుకున్న కొంతమంది లక్కీ బీటా టెస్టర్‌లకు మాత్రమే రౌండ్‌డ్ అలర్ట్‌లు అందుబాటులో ఉన్నాయని వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది.

అయితే మరికొద్ది వారాల్లో మరింత మంది వ్యక్తులకు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించింది.వాట్సాప్ యూజర్లు హై-క్వాలిటీ వీడియోలను పంపడం కోసం బీటా వెర్షన్‌లో డ్రాయింగ్ ఎడిటర్‌లో కొత్త బటన్‌ను పరిచయం చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube