కే‌సి‌ఆర్ కు కలిస్తోస్తున్న మహారాష్ట్ర పాలిటిక్స్ !

ఈ మద్య తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్( CM KCR ) మహారాష్ట్రపై ఏ స్థాయిలో దృష్టి కేంద్రీకరించారో అందరికీ తెలిసిందే.తరచూ ఆ రాష్ట్ర పర్యటనలు చేస్తూ.

అక్కడ బహిరంగ సభలు నిర్వహిస్తూ బి‌ఆర్‌ఎస్ ను విస్తరించే పనిలో నిమగ్నమైవున్నారు.ఏ ముహూర్తన కే‌సి‌ఆర్ మహారాష్టపై ఫోకస్ చేశారో గాని అక్కడి పరిస్థితులన్నీ కూడా బి‌ఆర్‌ఎస్ కు కలిసొస్తున్నాయి.

అసలే రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న మహారాష్ట్రలో కొత్త పార్టీ బి‌ఆర్‌ఎస్ ఎంట్రీ ఇవ్వడంతో అటు ప్రజల దృష్టి , ఇటు ఇతర పార్టీల నేతల దృష్టి బి‌ఆర్‌ఎస్ పై పడింది.

Telugu Ajit Pawar, Cm Kcr, Maharashtra, Shiv Sena, Ts-Politics

ఇప్పటికే చాలమంది నేతలు బి‌ఆర్‌ఎస్( Brs party ) లో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు.శివసేన, బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ వంటి బలమైన పార్టీలు ఎన్ని ఉన్నప్పటికి ప్రతి పార్టీలోని లొసుగులు ఎటొచ్చీ బి‌ఆర్‌ఎస్ కు అనుకూలంగా మారుతున్నాయి.ఇక ఇటీవల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి అజిత్ పవార్ బయటకు వెళ్ళడంతో పాటు మరో 20 మంది ఎమ్మెల్యేలను కూడా తనతోపాటు ఎన్సీపీ వీడేలా చేశారు.

దీంతో ఎన్సీపీలో ఏర్పడిన చీలిక కారణంగా ఆ పార్టీ దారుణంగా బలహీన పడే అవకాశం ఉంది.ఇప్పటికే శివసేన పార్టీ( Shiv Sena )లో చీలిక ఆ పార్టీ ఏ స్థాయిలో దెబ్బ తీసిందో అందరికీ తెలిసిందే.

Telugu Ajit Pawar, Cm Kcr, Maharashtra, Shiv Sena, Ts-Politics

ఇక ఇప్పుడు ఎన్సీపీలో కూడా అలాంటి పరిణామలే చోటు చేసుకోవడంతో బి‌ఆర్‌ఎస్ కలిసొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.తాజా పరిణామాలు చూస్తుంటే మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ లకు ప్రత్యామ్నాయంగా బి‌ఆర్‌ఎస్ నిలిచే ఛాన్స్ కనిపిస్తోంది.మరి మహారాష్ట్రలో ఏర్పడుతున్న రాజకియ సంక్షోభాన్ని బి‌ఆర్‌ఎస్ కు అనుకూలంగా కే‌సి‌ఆర్ ఎలా మలుస్తారనేది ఆసక్తికరం.రాజకీయాల్లో అత్యంత వ్యూహాత్మకంగా చతురత ప్రదర్శించగలిగే నేతల్లో కే‌సి‌ఆర్ ముందు వరుసలో ఉంటారు.

మరి అలాంటి కే‌సి‌ఆర్ తాజా పరిస్థితులను అలవోకగా బి‌ఆర్‌ఎస్ ను ఫేవర్ గా మార్చుకునే ఛాన్స్ ఉంది.ఒకవేళ అన్నీ అనుకూలించి మహారాష్ట్రలో బి‌ఆర్‌ఎస్ బలపడితే.వచ్చే ఏడాది జరిగే మహారాష్ట్ర ( Maharashtra )ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ బలమైన ముద్ర వేసే అవకాశం ఉందని రాజకియ విశ్లేషకులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube